తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖంగా చెప్పుకునే కుటుంబాలలో మెగా కుటుంబం కూడా ఒకటి. వారిలో వారికి ఎన్ని విభేదాలు ఉన్నా సరే వాటిని బయటకు కనబడకుండా మెగా హీరోలు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోల హవా ఎక్కువగా నడుస్తోంది. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ అలాగే మరికొందరు తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

 

మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు హీరోలు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా కుటుంబంలో చీలిక వచ్చింది అనే టాక్ ఎక్కువగా వినపడుతోంది. నిహారిక ను హీరోయిన్ గా ట్రై చేయవద్దని మెగాస్టార్ చిరంజీవి గత కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు. నాగబాబు ఆమెకు అవకాశాలు వచ్చే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అని టాక్, తనకు పరిచయాలు ఉన్న వారి ద్వారా నాగబాబు ఆమెను సినిమాల్లో స్టార్ హీరోయిన్ చెయ్యాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.

 

రామ్ చరణ్ విషయానికి వస్తే రాజమౌళి సినిమా కోసం తన తండ్రి అల్లు అరవింద్ సినిమా చేయాలని చూసినా సరే రాంచరణ్ కనీసం కథ కూడా వినడం లేదని అల్లు అర్జున్ ఆగ్రహంగా ఉన్నాడట. ఇటీవల ఒక కార్యక్రమంలో ఇదే విషయాన్ని కుటుంబంలోని ఒక పెద్ద వద్ద ప్రస్తావించినట్లు సమాచారం .అల్లు అరవింద్ ఒక ప్రముఖుడి జీవిత కథ ఆధారంగా రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం రాంచరణ్ కూడా వినే ప్రయత్నం చేయడం లేదని దీనిపై అల్లు అర్జున్ సీరియస్ గా ఉన్నారట. ఇలా మెగా కుటుంబంలో నిహారిక రామ్ చరణ్ కారణంగా ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి అని టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: