సినిమాలకు యువతకు వీడని బంధం. ముఖ్యంగా గత రెండు దశాబ్దాలుగా చూసుకుంటే సినిమాలకు యువత‌ రాజపోషకులుగా ఉంటున్నారు. వారి కోసమే  ఫిల్మ్  మేకర్లు సినిమాలు తీస్తున్నారు. యూత్ టార్గెట్ గానే అన్ని సినిమాల కధలూ ఉంటున్నాయి. వారినే మెప్పిస్తున్నాయి. 

 

ఈ నేపధ్యంలో వారానికి మూడు కొత్త బొమ్మలు సినిమా హాళ్ళో పడేవి. దాంతో యూత్ అటు వైపే చూపు పెట్టేవారు. వారి సందడి అంతా సినిమా థియేటర్లలోనే  కనిపించేది. అటువంటిది కరోనా ప్రభావంతో సినీ థియేటర్లు మూసేసారు. దాంతో బొమ్మ ఆడడంలేదు.

 

ఎక్కడ చూసినా పిచ్చెక్కే వాతావరణం. ఇక మరో వైపు  టీవీలు చూస్తే కరోనా వైరస్ గురించే పదే పదే చెబుతున్నారు. దాంతో యూత్ కి పిచ్చెక్కిపోతోందిట.  మొత్తానికి చూస్తే సినిమా హాళ్ళు ఎంతటి ప్రియురాళ్ళు యువతకు అయ్యాయో అర్ధమవుతోంది అంటున్నారు. ఆ విరహం అసలు భరించలేకపోతున్నారుట. తెరబంధాన్ని తలచుకుని తెగ కలవరపడుతున్నారుట.

 

మరి వారు ఏంచేస్తున్నారంటే చేతిలోని స్మార్ట్ ఫోన్ కి పని చెబుతున్నారుట. స్మార్ట్ ఫోన్నే లవ్ చేస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారుట. స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ మీద పడుతున్నారుట.  గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. తమకు నచ్చిన వాటిని అక్కడ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారుట.

 

దాంతో ఎన్నడూ లేని విధంగా ఇంటర్నెట్ వినియోగం గత నాలుగు రోజులుగా పెరిగిపోయిందని అంటున్నారు. దేశంలో ఒక్కసారిగా డేటా వినియోగం పెరిగిందని గ‌ణాంకాలు చెబుతున్నాయి. తాజా గ‌ణాంకాల ప్రకారం సగటున నెలవారీ  వైర్ లెస్ డేటా వినియోగం 10.37 జీబీగా నమోదు అయి ఉంది.

 

 మొత్తం మీద చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే యువత పని ఏమయ్యేదో. ఈ పిచ్చిలో ఏం చేసుకునే వారో. అందుకే అంతా థాంక్స్ టు  ఇంటర్నెట్ అంటున్నారుట. దాంతోనే కాపురం చేసేస్తున్నారుట మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: