ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు ఎన్నో చిత్రాల‌ను నిర్మించారు. దిల్‌రాజు సినిమా అంటే చాలు మినిమం గ్యారంటీ ఉంటుంది అని ఇటు ప్రేక్ష‌కులు అటు టాలీవుడ్ సెల‌బ్రెటీలు అంద‌రి అంచ‌నాలు దిల్రాజు పైన ఉంటాయి. దిల్‌రాజు సినిమాలంటేనే ఒక అంచ‌నా ఉంటుంది చాలా మందికి ఆయ‌న సినిమాలు అంటే చాలు మినిమం గ్యారెంటీ ఉంటాయి. మ‌రి అలాంట‌ప్పుడు ఈ మ‌ధ్య ఎందుకో కాస్త దిల్‌రాజు సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆయ‌న అంచ‌నాలు ఎందుకు త‌ప్పుతున్నాయ‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే... ప్ర‌స్తుతం మాత్రం దిల్ రాజు టైం స‌రిగాలేద‌నే చెప్పాలి.

 

ఇక ఎంతో గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో దిల్‌రాజు సినిమా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ తెలుగులో రీమేక్ అయి వ‌కీల్‌సాబ్‌గా వ‌స్తోంది. ఈ చిత్రం పై ప‌వ‌న్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. దాదాపు రెండేళ్ళ గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ తెర మీద క‌నిపించ‌బోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఎప్ప‌టి నుంచో దిల్‌రాజు ప‌వ‌న్‌తో సినిమా చేయాల‌ని ఎదురు చూస్తున్నారు. కానీ మ‌ధ్య‌లో ఆయ‌న రాజ‌కియాల్లోకి వెళ్ళ‌డం వ‌ల్ల కొంత గ్యాప్ వ‌చ్చింది. దీంతో మ‌ళ్ళీ అనుకోకుండా సినిమా చేసే అవ‌కాశం దిల్‌రాజుకు దొర‌క‌డం ఎంతో ఆనందించ త‌గ్గ విష‌యం అయితే దిల్ రాజు ఈ చిత్రం కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. అంతేకాక చాలా డ‌బ్బుల‌ను కూడా ఈ సినిమా పై పెడుతున్నారు. ఇక ప‌వ‌న్ కోసం ఓ ప్ర‌త్యేకమైన ప‌డ‌వ సెట్ కూడా వేశారు. దానిక చాలా ఖ‌ర్చు అయిందట‌. ఇదంతా వ‌కీల్‌సాబ్ మంచి హిట్ కొడుతుంద‌నే న‌మ్మ‌కంతో ఆయ‌న ఎంత ఖ‌ర్చుపెట్ట‌డానికైనా వెన‌కాడ‌టం లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే...ప‌వ‌న్ మీద ఎన్నో హోప్స్ పెట్ట‌కుని హెలీకాప్ట‌ర్ సీక్వెన్స్ కూడా ఏదో ప్లాన్ చేశార‌ని తెలిసింది. ఇక ఈ చిత్రం మీద హోప్‌తో ఆయ‌న జాను సినిమాని కూడా  బాగా ప్ర‌మోష‌న్ చెయ్య‌లేదు. ఆ చిత్రాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో అది ఆశించినంత హిట్ కాలేద‌నే వాద‌న కూడా మ‌రో వైపు వినిపిస్తోంది. ప‌వ‌న్‌ ఛాన్స్ ఇస్తే దిల్‌రాజుకి మాత్రం బ్యాడ్ టైమ్ న‌డుస్తుంది. ప‌వ‌న్ ఎంత స‌పోర్ట్ చేసినా ఇక దిల్‌రాజుకి ల‌క్ ఉండాలి అంటున్నారు అంద‌రూ.

మరింత సమాచారం తెలుసుకోండి: