టాలీవుడ్లో హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ ఒకొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. ఇక అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హీరో లాగా రాజేంద్రప్రసాద్ లాగా ఈ తరం హీరోల్లో అల్లరి నరేష్ ఉన్నారు. ఆయన హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన దాదాపు చిత్రాలన్నీ కూడా హిట్ అయ్యాయి. అల్లరి` చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆయన తన ఇంటి పేరురగా మార్చుకుని అల్లరి నరేష్ అయ్యారు. కామెడీనే ప్రధానంగా నమ్ముకుని వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తున్న అల్లరి నరేష్ గత కొంత కాలంగా కెరీర్ పరంగా కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. గత మూడేళ్లుగా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడంతో ఆ మార్పులకు తగ్గట్టుగా సినిమాలోని కథ కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే సినిమాలు చూస్తున్నారు. ఏమాత్రం ఫ్లాప్ అయినా ప్రేక్షకులు ఆ సినిమా మొహం కూడా చూడటం లేదు.
ఇక ఈ విషయాన్ని కొంత ఆలస్యంగా గ్రహించిన అల్లరి నరేష్ కొంత విరామం తీసుకుని ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే కొన్ని విలన్ పాత్రల్లో కూడా నటించారు. మహేష్‌తో కలిసి ఇటీవలె మహర్షి చిత్రంలో ఓ అద్భుతమైన పాత్రలో ఆయన నటించారు. ఇక ప్రస్తుతం ఆయన పంధాను మార్చి . నాంది చిత్రంలో హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలో నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రం కంటే ముందే అల్లరి నరేష్ బంగారు బుల్లోడు అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం సోలో హీరోగా ట్రై చేసే కంటే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లో ట్రై చెయ్యాలి లేదంటే నరేష్ పరిస్థితి కూడా సునీల్లాగా వచ్చేలా ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అల్లరి నరేష్ సినిమాని థియేటర్‌కి వెళ్ళి చూసే రోజులు పోయాయి.