నేచురల్ స్టార్ నాని కి ముందు నుంచి మంచి మాస్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నాని పక్కింటి కుర్రాడిగా నే నటించి ఫ్యాన్ ఫాలోయిన్ గి సొంతం చేసుకున్నాడు. సహజమైన నటన తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అందుకే నేచురల్ స్టార్ అన్న ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక నాని హీరో అంటే మినిమం గ్యారెంటి అని పెట్టిన డబ్బు ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తుందన్న భరోసాతో ఆయన తో సినిమాలు చేయడానికి ఎప్పుడు ముందుంటారు.

 

ఇక ప్రస్తుతం నాని హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా 'గ్యాంగ్ లీడర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికి ఆ సినిమా ఘోరమైన పరాజయ్యాన్ని మూట గట్టుకుంది. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా నానికి నిరాశనే మిగిలిచింది. దాంతో మిగతా డైరెక్టర్స్ ని కాదని తనకు రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలో నటిస్తున్నాడు. నాని - సుధీర్ బాబులు-నివేదా థామస్-అదితి రావు హైదరి నటిస్తున్న ఈ సినిమాకు 'వి' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు మేకర్స్. 'వి' సినిమా ఈ నెల ఉగాదికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో వాయిదా వేయక తప్పలేదు. 

 

ఇక 'వి' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే నిన్నుకోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'టక్ జగదీష్' సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ సినిమాలో చాలా క్లాస్ హీరోగా నాని నటిసున్నాడట. స్టైలిష్ ఫ్రెంచ్ గడ్డంలో మధ్య తరగతి కుర్రాడి పాత్రలో నాని కనిపించనున్నాడట. అంతేగాక ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రను పోషిస్తున్నాడట. నానిని ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించని రీతిలో డైరెక్టర్ శివ నిర్వాణ చూపించబోతున్నాడట. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. ఇక నిన్ను కోరి సినిమా తర్వాత మళ్ళీ నాని - శివ నిర్వాణ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే మొదలయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: