మహేశ్ బాబు ఒకటి అనుకుంటే.. విధి మరొకటి తలుస్తోంది. సూపర్ స్టార్ కెరీర్ ను సాఫీగా సాగనివ్వడం లేదు. కొన్ని అడ్డంకులు.. కొన్ని కష్టాలు చూపించిన మార్గాన్ని చూపుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ అనుకుంది రివర్స్ అయినా.. ఆయన మంచికే జరుగుతోందా..  

 

సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమాను ఎనౌన్స్ చేశారు. ఫుల్ స్క్రిప్ట్ నచ్చకపోవడంతో.. ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టేసి పరశురామ్ కు ఛాన్స్ ఇచ్చాడు మహేశ్. దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసేలోగా.. ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ పోషించే అవకాశం వచ్చింది. 

 

చిరంజీవి ఆచార్యలో మహేశ్ ది పెద్ద రోల్ కాదు. 20.. 30 రోజుల పాటు షూట్ లో పాల్గొంటే చాలు. ఈ క్రమంలో పరశురామ్ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక.. ముందుగా అనుకున్న నాగచైతన్యతో సినిమా పూర్తి చేసుకొని రావాలని పరశురామ్ ను కోరాడు మహేశ్. దీంతో పరశురామ్ చైతు సినిమాలో బిజీ అయ్యాడు. ఈలోగా.. ఆచార్యలో మహేశ్ కాకుండా ముందుగా అనుకున్నట్టు.. రామ్ చరణ్ తోనే తీయాలని మెగా టీమ్ అనుకుంది. ఇలా తర్వాతి మూవీ సెట్స్ పైకి రాకుండానే.. ట్విస్ట్ లు మహేశ్ తో ఆడుకుంటున్నాయి. 

 

కథ నచ్చక వంశీ పైడిపల్లికి నో చెప్పాడు మహేశ్. చేతిలో ఉన్న పరశురామ్ ను దూరం చేసుకున్నాడు. ఆచార్య టీమ్ హ్యాండిచ్చింది. గ్యాప్ లో పడిపోయిన ఈ టైమ్ లో బిగ్ బాస్ వచ్చాడు. బిగ్ బాస్ 4 సీజన్ హోస్ట్ ఆఫర్ మహేశ్ ముందుకొచ్చింది. రెమ్యునరేషన్ కింద 20కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చారని టాక్. బిగ్ బాస్ సీజన్ 110రోజుల పాటు సాగినా.. హోస్ట్ గా మహేశ్ పాల్గొనేది 30ఎపిసోడ్స్ మాత్రమే. పరశురామ్ సినిమా మొదలయ్యేలోగా.. టైమ్ వేస్ట్ చేయకుండా.. బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరగా కావాలని చూస్తున్నాడు మహేశ్. 

 

బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. రెండు, మూడు సీజన్స్ కు నాని.. నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న సీజన్ కు మంచి రేటింగ్ తో పాటు.. ప్రశంసలు వచ్చాయి. మరోసారి స్టార్ ను హోస్ట్ గా పెడితే బాగుంటుందన్న ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారని.. ఆల్ రెడీ మహేశ్ తో సంప్రదింపులు జరిపాయని తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: