తేజ‌శ్వి మ‌దివాడ తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌. కొంత కాలం పాటు న‌టించి ఆ త‌ర్వాత హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాల‌నుకుంది. దాని కోసం ఎన్నో డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించింది. అయితే ఈ భామ ఐస్‌క్రీమ్ చిత్రంతో హీరోయిన్‌గా కెరియ‌ర్‌ని మొద‌లుపెట్టింది. ఆ త‌ర్వాత నాన్న‌నేను నా బాయ్‌ఫ్రెండ్‌, కేరింత‌, బాబు బంగారం, రోజులుమారాయి, అనుక్ష‌ణం, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు, జ‌త‌క‌లిసే పండ‌గ‌చేస్తో ఇలా ఎన్నో చిత్రాల్లో న‌టించి మెప్పించింది ఈ భామ‌. అయితే ప్ర‌స్తుతం అను అనుకున్న‌ట్లు సోలో హీరోయిన్‌గా అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు. కెరియ‌ర్ బాగా డ‌వున్ ఫాల్ అవ్వ‌డంతో ఏం చేయాలో తెలియ‌క కొన్ని హాట్ ఫొటో షూట్ దిగి సోష‌ల్ మీడియాలో పిక్స్‌ని షేర్ చేసింది. 

 

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది సినిమావాళ్ళు ముఖ్యంగా అమ్మాయిల‌కి ఇదొక ఫ్యాష‌న్‌లాగా త‌యార‌యింది. కాస్త అవ‌కాశాలు త‌గ్గాయంటే చాలు హాట్ హాట్ ఫొటో షూట్‌లు దిగ‌డం వాటిని వాళ్ళ సోష‌ల్ మీడియా ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా వాటిని షేర్ చేయ‌డం గొప్ప అనుకుంటున్నారు. దాని వ‌ల్ల వాళ్ళ‌కు అవ‌కాశాలు వ‌స్తాయి అనుకుంటున్నారో ఏమోగాని హ‌ద్దులు దాని ఫొటోలు దిగిమ‌రీ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ ఫొటోల‌ను చూసి ద‌ర్శ‌కులు అవ‌కాశం ఇవ్వ‌డం సంగ‌తి పక్క‌న‌పెడితే వాళ్ళు మాత్రం సోష‌ల్‌మీడియాలో ఫుల్ ట్రోలింగ్‌కి గుర‌వుతున్నారు. అయితే వాటిని మాత్రం చాలా మంది చాలా లైట్ తీసుకుంటుంటే కొంత మంది తిరిగి వాటికి ఘాటుగా స‌మాధానం చెప్ప‌డం ఒక‌టి.

 

ఇటీవ‌లె సురేఖ‌వాణి కూడా ఇలానే త‌న హాట్ ఫొటోస్‌ని షేర్ చేసింది దాంతో కొంత మంది ఆమెను కామెంట్ చెయ్య‌గా తిరిగి వాళ్ళ‌కు కౌంట‌ర్లు ఇస్తుంది. అయితే అందులో కొంత‌మంది ఏమంటున్నారంటే అస‌లు అలాంటి ఫొటోలు పెట్ట‌డం ఎందుకు తిరిగి మ‌ళ్ళీ వార్నింగ్ ఇవ్వ‌డం ఎందుకు అని అంటున్నారు. ఇక కెరీర్ పూర్తిగా స్లో అయిపోతుందనుకున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని మళ్లీ వార్తల్లోకెక్కింది ఈ భామ‌. మొత్తానికి తెలుగమ్మాయి అయినప్పటికీ అందాలను ప్రదర్శించ‌డంలో మాత్రం తనకు ఎలాంటి మొహమాటం లేదని చెప్ప‌క‌నే చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: