కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం స్దభించిపోతుంది.. ఈ దశలో అన్ని ఆలయాలు కూడ మూతపడనున్నాయనే వార్త అందరికి తెలిసిందే.. అయితే ఇదే కోవలోకి తిరుమల తిరుపతి దేవస్దానం కూడా చేరింది.. కరోనా విసృతంగా విజృంభిస్తున్న సందర్భంగా వెంకన్న స్వామి వారి మందిరాన్ని మూసి వేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.. అయితే ఈ విషయంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటన చేశారు.. అదేమంటే తిరుమల శ్రీవారి ఆలయం మూసి వేసినట్లుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శ్రీవారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టం చేశారు.

 

 

అయితే భక్తులను రాకపోకలపై మాత్రం నిషేధం విధించినట్లు ఆయన వెల్లడించారు.. కాగా యథావిధిగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కైంకర్యాలు, నివేదనలు  ఏకాంతంగా ఆగమోక్తంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలిపారు.. ఇకపోతే గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడ్డాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో ఆయన్ను తీసుకుని వెళ్లి ఐసోలేషన్ హాల్లో చేర్చినట్లు పేర్కొన్నారు. అందుకే ఈ ఘటన జరిగిన తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు..

 

 

ఇక కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో తిరుమలకు భక్తులు ఎవరు వచ్చిన వారిని తిరుపతిలోనే ఆపేస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇక ఆ ఏడుకొందలవారిని దర్శించాలనే ఆశతో, భక్తితో ఎందరో భక్తులు చాలా వ్యయప్రయాసల కోర్చి వస్తుంటారని, అయితే ప్రస్తుతం, ప్రపంచంలోనే కాకుండా మన దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్ల కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని.. ఇందుమూలంగా భక్తులందరు సహకరించాలని ఆయన కోరారు.

 

 

ప్రస్తుతం దేశం మొత్తం ఇబ్బంది పడుతోందని, భక్తులు గుంపులుగా చేరితే కరోనా వైరస్ మరింతగా పెరిగే అవకాశం ఉండటం వల్ల ఈ నియమాన్ని పాటిస్తున్నామని అందువల్ల ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు... ఇక ప్రజలే అర్ధం చేసుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: