‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో మొదలు పెట్టబోతున్న మూవీకి సంబంధించి సుకుమార్ కు సంబంధించిన ఒక సెంటిమెంట్ ను ఖచ్చితంగా ఫాలో కావలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సుకుమార్ తన సినిమాలలో హీరోలను డిఫరెంట్ లుక్ తో చూపించడమే కాకుండా తన హీరోలకు గుబురు గెడ్డం లుక్ పెడితే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది నమ్మకంలో ఉన్నట్లు తెలుస్తోంది.


గతంలో జూనియర్ తో తీసిన ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో జూనియర్ ను ఒక వెరైటీ గా గెడ్డం లుక్ తో చూపించాడు. ఆతరువాత రామ్ చరణ్ ను ‘రంగస్థలం’ మూవీలో గుబురు గెడ్డం లుక్ లో చూపించాడు. ఈ రెండు సినిమాలు సుకుమార్ కు మంచి పేరు తెచ్చి పెట్టడమే కాకుండా సూపర్ హిట్ అయిన పరిస్థితులలో ఇప్పుడు మూడవ సారి కూడ సుకుమార్ బన్నీ పై ఈ గుబురు గెడ్డం సెంటిమెంట్ ను ప్రయోగిస్తున్నాడు. 


సుకుమార్ బన్నీల మూవీ అంతా గంధపు చెక్కల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే పరిస్థితులలో ఈ మూవీలో లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్న అల్లు అర్జున్ ను చాల రఫ్ గా మాసిన గుబురు గెడ్డంతో నలిగిన లుంగి గెటప్ లో చూపించడానికి సుకుమార్ ఇప్పటికే రంగం సిద్ధం చేసాడు. వాస్తవానికి అల్లు అర్జున్ కెరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాలోను రఫ్ లుక్ లో కనిపించని పరిస్థితులలో సుకుమార్ డిజైన్ చేసిన ఈ లుక్ విషయమై బన్నీకి కొన్ని అభ్యంతరాలు ఉన్నా సుకుమార్ సెంటిమెంట్ ను మన్నించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు.


వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావలసి ఉన్నా కరోనా సమస్యలు వల్ల ప్రస్తుతం సుకుమార్ బన్నీలు హైదరాబాద్ లోనే ఉండిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఏ విషయంలోనూ రాజీపడని సుకుమార్ ఇప్పుడు షూటింగ్ లకు కరోనా వల్ల విరామం దొరకడంతో బన్నీని ఖాళీగా కూర్చో పెట్టకుండా రోజుకు రెండు సార్లు రెండేసి గంటలు చొప్పున చిత్తూరు యాసను బన్నీ తన డైలాగ్స్ లో చాల సులువుగా పలకడానికి ఇద్దరు ట్యూటర్స్ ను పెట్టి బన్నీ డైలాగ్స్ విషయంలో ఎలా మెరుగుపరుచుకోవాలో కోచింగ్ ఇప్పిస్తున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: