కరోనా వల్ల భారీగా నష్టాలు జరుగుతున్నా.. కొంత మంచి కూడా జరుగుతోంది. ఎప్పుడు బిజీ బిజీ జీవితాలతో కుటుంబాలకు సమయం కేటాయించలేని చాలా మంది కరోనా కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతున్నారు. సరదాగా వాళ్లతో కలిసి ఆడిపాడుతున్నారు. సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో స్పెండ్ చేసిన క్వాలిటీ టైంను అభిమానులతో షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

 

సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్‌ గా ఉండే సీనియర్ నటి మందిరా బేడి. రెగ్యులర్‌ గా తన వర్క్‌ అవుట్ వీడియోస్‌ను తన సోషల్ మీడియా పేజ్‌ లో పోస్ట్ చేసే మందిరా. ఇప్పుడు కుటుంబ సభ్యులంతా ఖాళీగా ఉండటంతో వారితో కలిసి చేసిన సరదా పనుల వీడియోను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా తన కొడుకుతో పోటి పడుతూ చేసిన ఓ లాంగ్‌ జంప్‌ వీడియోను పోస్ట్ చేసింది మందిరా.

 

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాలో కీలక పాత్రలో నటించిన మందిరను తరువాత పూరి తనయుడు ఆకాష్‌ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమా కోసం తీసుకున్నారు. కానీ ఆ పాత్రకు ఆమె సూట్ కాకపోవటంతో ఆ స్థానంలో రమ్యకృష్ణను తీసుకున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Cleaner jump. Better technique. He gets a perfect 10.. 🙌🏽

A post shared by Mandira Bedi (@mandirabedi) on

మరింత సమాచారం తెలుసుకోండి: