స్వీటీ గా అందరి మన్ననలను అభిమానాన్ని పొందిన అనుష్క సాధారణంగా వివాదాలలోకి తల దూర్చదు. ఆమె 15 సంవత్సరరాలుగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఏ దర్శక నిర్మాతలతోను ఆమెకు తగువులు లేవు. ఇలాంటి పరిస్థితులలో ఆమె క్యాస్టింగ్ కౌచ్ వివాదం పై ఇప్పుడు మాట్లాడటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 


ఒక మీడియా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క ఈ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదు అన్న విషయం తాను చెప్పనని అయితే తన కెరియర్ లో మాత్రం తనకు అటువంటి సంఘటనలు ఎదురు కాలేదు అన్న క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఒక వ్యక్తి చుట్టూ ఉండే వ్యక్తుల ప్రవర్తన వాటి వ్యక్తిత్వం బట్టి ఆధారపడి ఉంటుందని కామెంట్స్ చేసింది.


కెరియర్ కు సంబంధించి ఎదగడానికి షార్ట్ కట్స్ ఉండవని ఈ విషయాలు తెలుసుకోలేక ఇండస్ట్రీలోకి వస్తున్న చాలామంది అమ్మాయిలు మోసపోతూ ఉంటారు అంటూ అనుష్క కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను ప్రతి విషయంలోనూ చాల క్లియర్ గా నిజయితీగా వ్యవహరిస్తూ ఉంటాను కాబట్టి బహుసా తనకు క్యాస్టింగ్ కౌచ్ లాంటి సందర్భాలు ఎదురై ఉండవు అంటూ కామెంట్స్ చేసింది. 


అంతేకాదు తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవర్ని తమ హద్దులు దాటకుండా కంట్రోల్ చేసే నేర్పు తనకు ఉందని ఈ ముఖ్య విషయం పై కంట్రోల్ లేకపోతే ఇండస్ట్రీలోకి అమ్మాయిలు రాకపోవడమే మంచిది అంటూ అభిప్రాయ పడింది. వాస్తవానికి తనతో నటించిన వారు అవకాశాలు ఇచ్చిన వారు అందరు స్నేహ పూరిత భావనతో ఉండటంతో తనకు క్యాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవాలు తనకు ఎదురుకాలేదు అంటూ అనుష్క చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు కూడ ఒక్క కరోనా సమస్య గురించి తప్ప మరే విషయం గురించి పట్టించుకోని పరిస్థితులలో ఇప్పుడు అనుష్కకు ఇంత ఆలశ్యంగా ఎందుకు గుర్తుకు వచ్చింది అన్నదే సమాధానం లేని ప్రశ్న..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: