మెగా స్టార్ చిరంజీవి తన తోటి హీరోలతో వ్యవహరించే విషయంలో మాత్రమే కాకుండా తాను నటించే సినిమాలకు సంబంధించిన పారితోషిక విషయంలో చాల ఖచ్చితంగా అన్నింటా మించి చాల తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు అని చాలామంది చెపుతూ ఉంటారు. అలాంటి చిరంజీవి ‘సైరా’ మూవీ విషయంలో భారీగా ఖర్చుపెట్టి ఆ మూవీ అనుకున్న ఫలితాలు సాధించక పోవడంతో కోట్లల్లో నష్టపోయాడు అంటూ ఆమధ్య గాసిప్పులు వచ్చాయి.


‘సైరా’ ఇచ్చిన అనుభవంతో చిరంజీవి తన ‘ఆచార్య’ విషయంలో చాల మారిపోయాడు అని అంటున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు కొణిదెల బ్యానర్ పై రామ్ చరణ్ మొదలుపెట్టిన ‘ఆచార్య’ మూవీకి కేవలం రామ్ చరణ్ బ్యానర్ మాత్రమే ఇస్తున్నాడట. అయితే పెట్టుబడి మాత్రం కొరటాల శివకు అత్యంత సన్నిహితులైన మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ‘ఆచార్య’ కు పెట్టుబడి పెడుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.


అంతేకాదు ఈసినిమాకు సంబంధించి మెగా కాంపౌండ్ కు మూడు విధాలుగా ఆదాయం వచ్చేలా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి లాభాలలో వాటా ఉండటమే కాకుండా చిరంజీవి భారీ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఈ మూవీలో రామ్ చరణ్ కు బదులు మహేష్ ను తీసుకుని రోజుకు కోటి వంతున ఇవ్వాలనుకున్న కొరటాల యాక్షన్ ప్లాన్ ను గ్రహించిన చిరంజీవి మహేష్ కు బదులు చరణ్ ను కొనసాగించమని పట్టుపట్టడం వెనుక రోజుకు కోటి పారితోషికం చరణ్ వస్తుంది అన్న మెగా స్టార్ వ్యూహాలలో భాగమే అని అంటున్నారు. 


ఇలా మూడు రకాలుగా మెగా కాంపౌండ్ కు ఆదాయాన్ని కలిగించే ప్రాజెక్ట్ గా మారిన ‘ఆచార్య’ వాటాల పంపకం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ గాసిప్ గా మారింది. ఈ మూవీ ప్రాజెక్ట్ ద్వారా ఇన్ని కోట్లు మెగా ఫ్యామిలీ పొందుతున్నా ఈ మూవీ టోటల్ ప్రాజెక్ట్ ను మటుకు తక్కువ ఖర్చుతో పూర్తి చేయమని చిరంజీవి ఇస్తున్న ఒత్తిడి కొరటాల భరించలేకపోతున్నాడు అన్న గాసిప్పులు కూడ మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: