దేవదాసు, జగడం, మస్కా సినిమాల తర్వాత రామ్ పాపులారిటీ తారా స్థాయికి చేరుకున్నదని చెప్పుకోవచ్చు. రెడీ సినిమాలో కూడా రామ్ పోతినేని నటనా ప్రతిభ మంచి పేరుని సంపాదించిపెట్టింది. కానీ అతని ఖాతాలో ఇటీవల కాలంలో( ఇస్మార్ట్ శంకర్ మినహాయించి) ఒక్కటంటే ఒక్క మంచి సినిమా కూడా పడలేదు. అతను తీసిన సినిమాలన్నీ యావరేజ్ టాక్ ని తప్ప బ్లాక్ బస్టర్ హిట్ అనే పేరుని తెచ్చుకోలేకపోతున్నాయి. ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ కి ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. రామ్ కనుమరుగైపోతున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ హిట్ అయ్యి ఆయన సినీ కెరీర్ని మళ్లీ గాడిలో పడేసింది. ప్రస్తుతం ఈయన red అనే సినిమాలో నటిస్తున్నాడు.





ఐతే ఈ క్రమంలోనే రామ్ పోతినేని తో రాజమౌళి సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి తీస్తున్న సినిమాలో ఏ హీరో నటించినా వారి సినీ కెరీర్ సూపర్ గా మారిపోతుంది. విక్రమార్కుడు సినిమా ద్వారా రవితేజ పాపులారిటీని అమాంతం లేవనెత్తాడు రాజమౌళి. యమదొంగ సినిమా ద్వారా ఎన్టీఆర్ పాపులారిటీని విపరీతంగా పెంచేసాడు. మగధీర సినిమా తీసి రామ్ చరణ్ క్రేజ్ ని కూడా పెంచేసాడు. మిడిల్ రేంజ్ హీరో అయిన నాని కి కూడా లైఫ్ ఇచ్చింది రాజమౌళియే అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎవరిలో ఎంత నటనా టాలెంట్ ఉన్నా... మంచి అవకాశాలు వస్తేనే వారికి గుర్తింపు లభిస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో అటువంటి 99% మంచి అవకాశాలు కల్పించేది రాజమౌళి ఒక్కడే అని చెప్పుకోవచ్చు. అతని సినిమాలో ఓ చిన్న పాత్ర చేయాలని ఎంత పెద్ద స్టార్ డమ్ ఉన్న వ్యక్తి అయినా కోరుకుంటారు.




మరి అలాంటిది అతని సినిమాల్లో లీడ్ పాత్రలో నటించే ఛాన్స్ వస్తే ఇక వారి లైఫ్ మారిపోయినట్లే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ అవకాశం హీరో రామ్ పోతినేని కి లభించిందనే వార్తలు వస్తుండగా... అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ఇక రాజమౌళితో కలిసి ఓ సినిమాలో నటిస్తే తన కెరీర్ కి తిరుగు ఉండదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ లో బిజీ అయిపోయిన రాజమౌళి... ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నాడు. ఆ తర్వాత ఓ ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. దీన్ని బట్టి చూస్తే తను తన తదుపరి చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభిస్తాడని తెలుస్తోంది. అయితే రాజమౌళి తన నెక్స్ట్ చిత్రాన్ని 50 కోట్ల బడ్జెట్ తో చేయనున్నాడని వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే మిడిల్ రేంజ్ హీరో అయినా రామ్ పోతినేని ని హీరో గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దగ్గుపాటి రానా పేరు కూడా వినిపిస్తోంది. మరి వీళ్ళిద్దరిలో రాజమౌళి తదుపరి సినిమాలో హీరో చాన్స్ ని ఎవరు కొట్టేస్తారో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: