ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భూతం పట్టి పీడిస్తుంది.  రోజు రోజుకీ పెరిగిపోతున్న మరణాలే ఇందుకు సాక్షం.  మొన్నటి వరకు చైనాలో.. ఇప్పుడు ఇటలీ, ఫ్రాన్స్ ఇతర దేశాల్లో ఇది కరాళ నృత్యం చేస్తుంది.  కరోనా భూతం ఇప్పుడు భారత దేశంలో కూడా ప్రవేశించింది. అయితే ఇప్పటి వరకు 200 పైగా ఈ కేసులు నమోదు అయ్యాయి.. ఐదుగురు మరణించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  ఇక కరోనా వైరస్ ని తరిమేందుకు మనం జాగ్రత్తలు మాత్రమే తీసుకోవాలి.. ఇందుకోసం సెలబ్రెటీలు తమకు తోచిన సందేశాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాలన్నింటిని అలర్ట్ చేసింది.. వైద్యశాఖ అప్రమంత్తంగా ఉండాలని సూచించింది.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభిస్తోంది.

 

మోదీ సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలని, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు జనతా కర్ఫ్యూను పాటించాలని పలువురు సెలబ్రిటీలు అభిమానులను కోరుతున్నారు. ప్రస్తుం కరోనా వైరస్ ని నిర్మూలించేందుకు మెడిసన్ ఏదీ లేదు.. మన జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష అంటున్నారు.  ఇందుకోసం బయటకు వెళ్తే మాస్క్ ధరించాలి.. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.. వీలైతే శానిటైజర్స్ వాడాలి.  గుంపులుగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం మానివేయాలి.. దగ్గు, తుమ్ములు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన మెడిసన్ తీసుకోవాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సరైన వైద్యం తీసుకోవాలి.. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగిస్తున్నారు. 

 

ఇక ప్రధాని పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా, ఈ కోవలోకి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా చేరాడు. రేపు ఉదయం ఏడు గంటల నుంచి  రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలని, మనం వారికిచ్చే గౌరవం వాటిలో కనిపించాలని అన్నాడు.  కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని మహేశ్‌బాబు పిలుపునిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: