తమిళ తలైవా, తెలుగు సూపర్ స్టార్ రజనీకాంత్ గూర్చి తెలియనివారు ఉండరు. రజిని స్టైల్ చూస్తే మతి పోవాలిసిందే.  డెబ్బయేళ్ళ వయసులోనూ యంగ్ హీరోలకు దీటుగా  తనదైన శైలిలో వేగంగా సినిమాలు చేయడంపై  ఆయన ఫ్యాన్స్ తోపాటు జనరల్ ఆడియెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.రజినీకాంత్ స్పీడ్ మాములుగా లేదుగా అని నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

 

  ఈ సంక్రాంతికి `దర్బార్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సినిమా మంచి పేరు సంపాదించుకుంది. ఫాన్స్ సినిమా హిట్ అయిన అవ్వకపోయిన రజినీకాంత్ ఫాన్స్ ఫాల్లోవింగ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ఇప్పుడు ప్రస్తుతం  ఆయన  దరువు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రజినీకాంత్ కి 166 వ చిత్రం. దీనికి `అన్నత్తె`(అన్నయ్య) అనే పేరుని  కూడా  పరిశీలిస్తున్నారు. ఇందులో మీనా- ఖుష్బు- నయనతార- కీర్తిసురేష్ వంటి సీనియర్.. జూనియర్ భామలు నటిస్తున్నారు.

 

ఇంతమంది సీనియర్ అండ్ సూపర్ స్టార్స్ నటిస్తున్నారంటే సినిమా ఒక లెవెల్ లో ఉంటుందని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.ఈ సినిమా  యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు. మాస్ యాక్షన్ చిత్రాలకు శివ పెట్టింది పేరు. ఆయన రూపొందించిన సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా  కరోనా వల్ల వాయిదా పడినట్టు తెలిసింది. రజనీ కెరీర్ 169వ చిత్రం కూడా ఖాయం చేశారు. కమల్ హాసన్ నిర్మాణంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

 

ఇప్పటికే దీని పై ప్రకటన వచ్చింది. దీంతోపాటు 170వ చిత్రానికి కూడా తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ఈ సినిమాకి కొరియోగ్రాఫర్  అండ్  డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించనుండటం విశేషం. రజనీ కాంత్ కి  లారెన్స్ పెద్ద ఫ్యాన్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పట్నుంచో ఆయనతో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట.

 

ఇటీవల ఓ కథని రజనీకి చెప్పగా, ఆయన పాజిటివ్ గా స్పందించారట. పూర్తి కథని సిద్ధం  చేసే పనిలో లారెన్స్ ఉన్నారు.లారెన్స్ అండ్ రజినీకాంత్ కాంబినేషన్ సూపర్ హిట్ అని అభిమానులు ఆనందపడుతున్నారు.170 వ సినిమా రజినీకాంత్ లైఫ్ లో మరుపురాని చిత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: