ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుండటంతో జనజీవనం స్తంభించి పోయింది. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్‌ గాయని కనికా కపూర్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన కనికా పలు ప్రైవేట్‌ పార్టీల్లో పాల్గొనటం, తరువాత ఆమెకు కరోనా సోకినట్టుగా తేలడటంతో ఒక్కసారిగా అలజడి చెరల రేగింది. ముఖ్యంగా కనికా పాల్గొన్న పార్టీలో పలువురు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొనటం తరువాత వారు పార్లమెంట్‌ తో పాటు రాష్ట్రపతి భవన్‌ ను కూడా వెళ్లటంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

 

ఈ నేపథ్యంలో కనికాపై చట్టపరమైన చర్యలకు దిగించి ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం. తాజాగా మరో గాయని సోనా మహాపాత్ర కనికా పై మండి పడింది. విదేశాల నుంచి వచ్చిన తరువాత కనీసం బాధ్యతగా వ్యవహరించకుండా అందరితో కలిసి తిరగటం, పబ్లిక్‌ ఫంక్షన్లకు అటెండ్ కావటానికి సోనా తప్పు పట్టింది. కనికా చర్యలపై వరుస ట్వీట్లు చేసిన ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. 

 

`భారత్‌ లో కరోనా వైరస్‌ విస్తరించటం ఖాయం. ఎందుకంటే ఇండియాల అంతా బాధ్యత లేని వేదవలు ఉన్నారు. వీళ్లంతా ప్రభుత్వమే అన్ని చేయాలని కోరతారు. కానీ వాళ్లు మాత్రం ఏం చేయరు` అంటూ కనికా ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది. కనికా కపూర్ శుక్రవారం తనకు కరోనా సోకినట్టుగా తన సోషల్ మీడియా పేజ్‌ లో కామెంట్ చేసింది. గత నాలుగు రోజులుగా నాకు జ్వరం లక్షణాలు ఉండటంతో నేను స్వయంగా టెస్ట్ చేయించుకున్నా. ఆ టెస్ట్ లో నాకు కోవిడ్ 19 సోకినట్టుగా తేలింది. ప్రస్తుతం నేను నా కుటుంబం సభ్యులు మా ఇంట్లోనే క్వారెంటైన్‌ లో ఉన్నాం` అంటూ కామెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: