కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమే అల్లకల్లోలం లా మారిపోయింది. అందరు భయబ్రాంతుల్లో మునిగిపోయి ఇళ్లలో నుంచి బయటకి రావడమే మానేశారు. షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, షూటింగ్స్, రైళ్లు, ప్రయాణాలు అన్ని ఆపేసారు. కానీ విచిత్రం ఏంటంటే ఇంత జరుగుతున్న గాని ఒక  రియాలిటీ షో బృందానికి, ఒక హీరోయిన్ కి మాత్రం ఏవేవి తెలియదట.

 

అసలు కరోనా ఎవరు? ఏంటది అని అడిగారంటే  ఆశ్చర్యపోవాలా !లేక వాళ్ళ అమాయకత్వానికి నవ్వాలో తెలియడం లేదు.  ప్రభుత్వాలు కరోనా కల్లోలం పై ఇంత ప్రచారం చేస్తున్నా వాళ్ళకి వినిపించడం లేదట.అసలు వివరాల్లోకి వెళితే  హీరోయిన్ సంజన గుర్తు ఉందా ! బుజ్జిగాడు సినిమాతో హీరోయిన్ గా  తెలుగులో పాపులర్ అయింది ఈ  బెంగుళూరు బ్యూటీ సంజన. ఆ తర్వాత పలు చిన్న చిన్న సినిమాల్లో నటించింది. కానీ ఈ భామకి అంతగా గుర్తింపు రాలేదు.

 

తర్వాత సొంత ఇండస్ట్రీ అయిన కన్నడ వరకే పరిమితమైంది. మధ్యమధ్యలో తెలుగు - మలయాళం చిత్రాల్లో నటించింది. అయితే  తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది సంజన. దీంతోపాటు సీరియల్స్, వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె హిందీలో ప్రసారమయ్యే `ముజ్సే షాదీ కరోగే` అనే రియాలిటీ షోలో నటిస్తోంది. అక్కడే వచ్చింది చిక్కు అంతా. ఈ షో కి   సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఉండేందుకు షో బృందం సెల్ ఫోన్, కెమెరా వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేదించింది. అయితే ఈ షో అంతా ఒక పెద్ద ఇంటిలో  కొన్నిరోజులుగా జరుగుతుoడడంతో  బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

 

దీంతో కరోనా వైరస్ ఇంతగా ప్రబలుతున్నా.. ఆ విషయం వారికి తెలియలేదట. అందుకే మాకేమీ పట్టనట్టు చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు ఎంటర్ అయ్యి పరిస్థితి వివరించగా.అవాక్కవడం ఈ షో బృందం వంతయ్యింది. దీంతో వెంటనే షూటింగ్ ఆపేశారంట. 

 

ఈ విషయాన్ని  స్వయంగా సంజన బయట ప్రపంచానికి చెప్పి  తన అమాయకత్వాన్ని చాటుకుంది.  బయట ఇంత జరుగుతుందా అని ఆశ్చర్యాన్ని వెళ్లబుచ్చింది. ప్రస్తుతం `షిట్ హ్యపెన్` అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీంతోపాటు తమిళంలో `బాక్సర్` అనే చిత్రంతో పాటు మరో చిత్రంలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: