కరోనా భయంతో ప్రజలు ప్రయాణాలంటేనే భయపడుతున్నారు. ప్రభుత్వం కూడా అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరటంతో అంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ఓ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్లో స్వయంగా తాను చేసి చూపిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.

 

కరోనా అత్యంత వేగంగా సంక్రమించే వైరస్ కావటంతో తాను ప్రయాణిస్తున్న రైళు భోగిని డిసిన్ఫెక్ట్ చేస్తున్న ఫోటోలతో పాటు వీడియోను పోస్ట్ చేసింది. వైప్స్, సానిటైజర్‌ తో రైళ్లో తాను కూర్చొనే సీటును క్లీన్ చేసింది. `తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోవటంతో ఇంటికి తిరిగి వెళుతున్నా.. మార్చి 31 వరకు సెల్ఫ్‌ క్వారెంటైన్‌లో ఉండబోతున్నా` అంటూ కామెంట్ చేసింది.

 

ఈ సందర్భంగా ఆమె ఫాలోవర్స్‌కు కొన్ని సూచనలు చేసింది. `చాలా ఇంపార్టెంట్‌. మీరు మీ మాస్క్ ముందు భాగాన్ని టచ్‌ చేయకండి. బయటకు వెళ్ల వలసి వస్తే లాటెక్స్‌ గ్లౌస్‌ కూడా వాడండి. అప్పుడు డోర్‌ హ్యాండిల్స్ ఇతర వస్తువులను టచ్ చేసినా వైరస్ ప్రభావం ఉండదు. వీలైనంత జాగ్రత్తగా ఉంటేనే వైరస్‌ బారిన పడకుండా తప్పించుకోగలరు.` అంటూ సందేశాన్నిచ్చింది రవీనా.

మరింత సమాచారం తెలుసుకోండి: