ఇప్పుడు ఎవరి నోట విన్నా కరోనా మాటే.. ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తుంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 271కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ప్రకటన చేసింది. కరోనా కారణంగా ఇప్పటివరకు దేశంలో మొత్తం నలుగురు మృతి చెందారని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్‌, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కరోనా పాజిటివ్ అని తేలిన వారిలో 39 మంది విదేశీయులని తెలిపింది.   భారత దేశంలో ఎక్కువగా కరోనా విదేశీయుల నుంచే ఎక్కువగా వస్తుందని అంటున్నారు. మరోవైపు సెలబ్రెటీలు కరోనా గురించి జాగ్రత్తలు చెబుతున్న విషయం తెలిసిందే. 


తాజాగా  త్రిష కూడా క‌రోనా వైర‌స్ నుండి మ‌న‌ల్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలంటూ అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఓ వీడియో విడుద‌ల చేశారు. ‘‘మీకు తుమ్ము, దగ్గు వస్తే.. కర్చీఫ్ లేదా టిష్యూని అడ్డంగా పెట్టుకోండి. 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులను కడుక్కోండి. రద్దీ ప్రాంతాలకు వెళ్లకండి. దగ్గు, జ్వరం ఉంటే ఇత‌రుల‌తో మాట్లాడ‌టం త‌గ్గించండి. మాస్కుల‌ను ధ‌రించండి. ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి వెళ్లండి’’ అని తెలిపారు త్రిష‌. ఈ మద్య కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నటించేందుకు రెమ్యూనరేషన్ కారణం అని అంటున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల పలు షూటింగ్స్ వాయిదా వేసుకున్నారు.  మూవీస్ కూడా వాయిదా వేసుకునే యోచేలో ఉన్నారు.  


సెలబ్రెటీలు తమ ఇంటి వద్దనే కుంటుం సభ్యులతో గడుపుతున్నారు.  అంతే కాదు రేపు దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ప్యూ’ కూడా చేయడానికి సిద్దమవుతున్నారు.  ఈ నేపథ్యంలో చాలా మంది సెలబ్రెటీలో పీఎం మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఏది ఏమైనా భారత్ లో కూడా కరోనా ప్రభావంతో జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: