ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత దేశంలోని జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వారి చికిత్సకు సరిపడా పడకలు సిద్ధం చేయాలని అన్ని ఆసుపత్రులు, వైద్య విద్యాసంస్థలను కేంద్రం కోరింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఈ మేరకు తగిన సూచనలు చేసింది. ఈ నెల 22 న దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. మరోవైపు కరోనా కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నారు...  బెడ్లతో పాటు ఐసోలేషన్‌  సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అదే విధంగా వెంటిలేటర్లను సిద్ధం చేసుకొని, ఆయా వార్డుల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.  

 

బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు వీలుగా అదనపు సిబ్బందిని కూడా నియమించుకోవాలని తెలిపింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 271కి చేరిందని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసందే. భార‌త ప్ర‌ధాని క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం ప్ర‌జ‌లు ఒక‌టి కావాల‌ని చెబుతూ ప్ర‌జ‌లందరూ స్వ‌చ్ఛందంగా ఈ నెల 22న జ‌న‌తా క‌ర్ఫ్యూలో పాల్గొనాల‌న్నారు.

 

అందులో భాగంగా ఉద‌యం 7 గంట‌ల‌కు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. తాజాగా కమల్ హాసన్ ప్రధాని మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు.  ఈ ఘోర విపత్తు నుండి మ‌నల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే అంద‌రూ స‌మైక్య‌త‌తో ఇంట్లోనే ఉండాల‌ని క‌మ‌ల్ అన్నారు. ఇప్పుడు అసాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన్నాయని, వాటి నివార‌ణ‌కు అసాధార‌ణ చ‌ర్య‌లు చేపప‌ట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అన్నారాయ‌న‌. అయితే కమల్ చేసిన పోస్ట్ కి హీరోలు ర‌జినీకాంత్‌, అజిత్, విజ‌య్, సూర్య‌, ధ‌నుష్‌, విజ‌య్ సేతుప‌తి, శింబు త‌దిత‌రులను ట్యాగ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: