ప్రపంచమంతా కరోనా భూతంతో వణికిపోతోంది. చైనా నుంచి అమెరికా వరకూ ప్రతి భూభాగాన్ని చుట్టేసి ప్రళయం సృష్టిస్తోంది. ఎప్పుడు ఎటునుంచి ఏం వినాలో అనేంతగా భయభ్రాంతులకు గురిచేస్తోంది. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీల వరకూ ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో కాంట్రవర్సీకి పెట్టింది పేరైన సినీ నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కరోనా వైరస్ గురంచి చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.

 

 

‘కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే రెగ్యులర్ గా సెక్స్ చేస్తే సరిపోతుంది’ అంటూ తనదైన స్టైల్లో కామెంట్లు చేసింది. అంతే కాకుండా ఈ కరోనా వైరస్ కు పవన్ కల్యాణ్ కు కూడా లింక్ పెట్టింది. ‘పవన్ కల్యాణ్ ఇంట్లో ఓ ఫారిన్ చిక్ ఉంది.. మరి పవన్ కు కరోనా వైరస్ సోకిందా’ అని కూడా కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు, పవన్ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన కామెంట్లు, విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటివల శ్రీరెడ్డి ప్రారంభించిన కుకింగ్ చానెల్ కు సబ్ స్క్రైబర్లు ఎక్కువగా ఉన్నారు. శ్రీరెడ్డ మారిపోయిందా అనే ఆలోచనలకు బ్రేక్ వేస్తూ మళ్లీ తనదైన స్టైల్లో పోస్టులు చేస్తోంది.  

 

 

కరోనా వైరస్ బారిన పడకుండా సెలబ్రిటీలందరూ తగిన జాగ్రత్తలు చెప్తూంటే శ్రీరెడ్డి మాత్రం ఇలాంటి కామెంట్లు చేస్తూ విమర్శలకు గురవుతోంది. ఈ వైరస్ అంటే నీకు ఎగతాళిగా ఉందా.. అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. నువ్వు కూడా ఇలానే ట్రై చేసి మాకు చెప్తున్నావా.., ఇలాంటి కామెంట్లు చేయడం నీకు కరెక్ట్ కాదు.. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మేటర్ ఏదైనా సరే.. అందులోకి పవన్ కల్యాణ్ ను తీసుకురావటం శ్రీరెడ్డికి కామన్ అయిపోయింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: