ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించటం ఏమోగానీ ఇపుడు సినిమాలకు పెట్టుబడి పెడుతున్న నిర్మాతలు మాత్రం భారీగా నష్టపోతున్నారు. సినిమా షూటింగ్ వాయిదా పడటం ,సినిమా విడుదల వాయిదా పడటం అలాగే అడ్వాన్సులు ఇచ్చిన సినిమాలు కూడా మొదలు కాకపోవడంతో ఇప్పుడు నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రెండు రూపాయలు మూడు రూపాయలు కొంతమంది అయితే ఆరు రూపాయలు కూడా వడ్డీలు తీసుకుని సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నారు.

 

అలాంటి సినిమాలు ఇప్పుడు ఆగిపోవడంతో నిర్మాతలకు ఏం చేయాలి అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. మన దేశం లో సినిమా మార్కెట్ అనేది భారీగా పెరిగింది. దీనితో భారీ బడ్జెట్ సినిమాల తో పాటుగా చిన్న సినిమాల సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది. దీనితో నిర్మాతలు ఎక్కువగా సినిమాలు తెరకెక్కించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే భారీగా అప్పులు తీసుకొచ్చి సినిమా నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. చిన్న హీరో సినిమాకు కూడా భారీగా పెట్టుబడి పెడుతూ ఉంటారు నిర్మాతలు. 

 

ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ కొట్టిన దెబ్బ ఇప్పట్లో నిర్మాతలను కోలుకునే స్థితిలో కూడా ఉంచడం లేదని పలువురు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో లకు భారీగా అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాత అయితే ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే వారి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో అగ్ర నిర్మాతలు దిల్ రాజు అలాగే దానయ్య అల్లు అరవింద్ వంటి వారు కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు చిన్న హీరోలతో సినిమాలు చేసే వాళ్ళ పరిస్థితి దాదాపు అగమ్యగోచరం.  మరి ఈ కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుతుందో ఆ వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో చూడాలి. ఈ పరిస్థితి సినిమాల్లో పని చేసే వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: