భారతీయ చలన చిత్ర రంగంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది.  ఆరవైలో కూడా ఇరవైలా కనిపిస్తూ.. ఇప్పటికీ ఏడాదికి ఒకటీ రెండు సినిమాల్లో నటిస్తూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నారు.  ఈ ఏడాది మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజినీకాంత్. ఒక మూవీ రూపొందుతుండగానే మరో మూవీ లైన్లో పెడుతున్నాడు ఈ సూపర్‌ స్టార్‌. ‘దర్బార్‌’తర్వాత శివ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా అనంతరం ఖైదీ, మాస్టర్‌  ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా ఉంటుంది. ఈ మూవీ  కమల్‌హాసన్‌ నిర్మాణసంస్థ నిర్మించడం విశేషం.

 

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓ అదృష్టం లారెన్స్ తలుపు తట్టిందని అంటున్నారు.  సూపర్ స్టార్ తో డైరెక్షన్ చేసే ఛాన్స్ లారెన్స్ కి దక్కిందని కోలీవుడ్ టాక్.   దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ఇండస్ట్రీలో ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది.  ప్రస్తుతం లారెన్స్ హిందీలో అక్షయ్ కుమార్ తో 'లక్ష్మి బాంబ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇక రజిని శివ దర్శకత్వం లో 'అన్నాత్తే' అనే మూవీలో నటిస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుందని సమాచారం. అయితే రజినీకాంత్ అంటే లారెన్స్ కి ఎంతో ఇష్టం.. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని.. ఆయన స్టైల్ అంటే ఇప్పటికీ పడి చచ్చిపోతానని అన్నారు.

 

తన చిన్న తనంలో రజినీ కాంత్ మూవీ రిలీజ్ అయ్యిందంటే థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకున్నేవాళ్లమని.. ఓ హీరో పోస్టర్ పై పేడ కూడా కొట్టేవాడినని చెప్పిన విషయం తెలిసిందే.  గతంలో రజినీతో కలిసి నటించాలని.. లేదా ఆయనతో ఒక్క సినిమా తీసే ఛాన్స్ వచ్చినా తన అంత అదృష్టవంతుడు లేడని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: