ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భామ నిధి అగర్వాల్ ప్రస్తుతం మంచి మంచి అవకాశాలతో ముందుకు వెళ్తుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా కంటే ముందు రెండు మూడు మూవీల్లో నటించినా కూడా పెద్దగా పేరు రాలేదు. కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం సాధించడంతో ఆమెకి ఒక్కసారిగా అందరి దృష్టి అందులో నటించిన హీరోయిన్ల మీద పడింది.

 

 


అయితే ప్రస్తుతం ఈ భామ మరో కొత్త స్టెప్ తీసుకోనుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో జిల్లెలమ్మ జిట్ట సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులకి, చూపించిన గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇస్మార్ట్ శంకర్ లో ఐటెం సాంగ్ లేకపోయినా, జిల్లెలమ్మ జిట్ట సాంగ్ ఐటెం నంబర్ ని తలపించింది. ఆ సాంగ్ లో నిధి పర్ ఫార్మెన్స్ చూసిన వారు ఐటెం సాంగ్స్ లో నిధి అగర్వాల్ బాగా సక్సెస్ అవుతుందని ప్రతీ ఒక్కరూ భావించారు.

 

అలా గుర్తించిన వారిలో బెల్లంకొండ శ్రీనివాస్ ముందున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం లాంఛనంగా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఐతే ఈ సినిమాలో బెల్లంకొండతో స్పెషల్ సాంగ్స్ లో స్టెప్పులు వేయడానికి నిధి అగర్వాల్ ని సంప్రదించారట. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఆమె పర్ ఫార్మెన్స్ చూశాక తాము అనుకున్న పాటకి నిధి అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.

 

 

ఈ పాట కోసం నిధికి పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇవ్వాలని చూస్తున్నారు. కేవలం ఐదు నిమిషాల పాటకి ఎనభై లక్షల వరకి పారితోషికం ఇవ్వాలని అనుకుంటున్నారట. మరి ఆఫర్లు ఎక్కువగా లేని నిధి అగర్వాల్ ఈ స్పెషల్ సాంగ్ ఆఫర్ ని ఒప్పుకుంటుందా లేదా చూడాలి. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం ఆమెకి అవకాశాలు తన్నుకుంటూ వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: