ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ భారీగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఒక హీరోతో మరో హీరో స్నేహం చేయడమే. అలాగే చిన్న హీరోలు కూడా ఇప్పుడు పెద్ద హీరోలతో స్నేహం చేయడం లేదా వారి సినిమా కార్యక్రమాలకు వారిని ఆహ్వానించడం వంటివి చేస్తున్నారు. దీని ద్వారా మార్కెట్ ని భారీగా పెంచుకోవచ్చు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది. ఇక ఈ మధ్య కాలంలో మరొకటి కూడా చోటు చేసుకుంటోంది.

 

 చిన్న హీరోలు పెద్ద హీరోల నిర్మాణ సారథ్యంలో నటించడానికి రెడీ అవుతున్నారు శర్వానంద్ విజయ్ దేవరకొండ అలాగే కాస్త విషయం ఉన్న చిన్న హీరోలు పెద్ద హీరోలు నిర్మాతలు అయితే తాము సినిమాలు చేయడానికి రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారు. దీనితో స్టార్ హీరోలు రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి హీరోలు ఇప్పుడు చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నవారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నాని తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రాజమౌళి నాని తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

ఈ సినిమాకు తాను నిర్మాతగా వ్యవహరిస్తాను  అని జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. జూనియర్ తో పాటుగా ఈ సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్ కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. రాజమౌళి ఇప్పటికే ఈ సినిమా కథను వినిపించినట్లు కూడా సమాచారం. దీనితోనే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా పెట్టి సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు చిన్న హీరోలకు స్టార్ హీరోలు నిర్మాతగా వ్యవహరించడం అనేది ఇప్పుడు టాలీవుడ్లో శుభపరిణామం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: