కరోనా వలన టాలీవుడ్ పై ప్రభావం నామమాత్రమే అనుకున్నారు. కరోనా ప్రకంపనలు తెలుగు ఇండస్ట్రీకి  చేరాయి.  కరోనాను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని.. నెలాఖరు వరకు స్కూల్స్, థియేటర్స్, షాపింగ్ మాల్స్ మూసేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో మూడు సినిమాలు వాయిదా పడ్డాయి. రెండు పెద్ద సినిమాల షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. 

 

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి టాలీవుడ్ ను దెబ్బకొట్టింది. కరోనా వైరస్ తో కర్ణాటక వ్యక్తి హైదరాబాద్ లో చనిపోవడం.. నెల్లూరు వాసికి కరోనా నెగిటివ్ రావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమై నెలాఖరు వరకు థియేటర్స్ మూసివేయాలని ఆదేశించింది. దీంతో 25న రిలీజ్ కావాల్సిన.. నాని సినిమా వి.. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా.. ప్రదీప్ 30రోజుల్లో ప్రేమించడం ఎలా వాయిదా పడ్డాయి. కరోనా ప్రభావం తగ్గితే.. ఏప్రిల్ లో వి సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటన విడుదల చేశారు. 

 

కరోనా ఎఫెక్ట్ కారణంగా బన్నీ, సుకుమార్ మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రివేంజ్ ఫార్ములాగా కథ నడుస్తుంది. కేరళ అడవుల్లో షూటింగ్ చేయాలనుకున్నారు. అయితే.. అక్కడి ప్రభుత్వం షూటింగ్స్ కు ఇచ్చిన పర్మిషన్ వెనక్కి తీసుకుంది. దీంతో బన్నీ మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేది కష్టమే. 

 

400కోట్లతో భారీ బడ్జెట్ గా తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ కూడా కరోనాతో నష్టపోతుంది. సినిమా కొత్త షెడ్యూల్ ను పుణెలో ప్లాన్ చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారీ క్రౌడ్ తో షూటింగ్ చేయడం కష్టమేనన్న అభిప్రాయంలో చిత్ర యూనిట్ ఉంది. అదేమిటో గానీ.. ట్రిపుల్ ఆర్ కు పూణె కలిసి రాలేదు. అక్కడ షూటింగ్ స్టార్ట్ చేశారో లేదో.. రామ్ చరణ్ గాయపడటంతో ఆ షెడ్యూల్ రద్దయింది. తాజాగా కరోనా అడ్డుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: