ఒక్కసారి ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయ్యాక కష్టమో.. నష్టమో ముందుకెళ్దాం. మిడిల్ డ్రాపులు వద్దు అనుకునేవాళ్లు స్టార్లు. కానీ ఇప్పుడు కష్టనష్టాలు పడటానికి ఎవరూ సాహసించడం లేదు. డౌట్ వచ్చిందంటే చాలు హీరో, హీరోయిన్లు అంతా ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేస్తున్నారు. 

 

మహేశ్ బాబు సినిమాల విషయంలో చాలా సెలక్టివ్ గా ఉంటున్నాడు. స్టోరీలో ఏ మాత్రం తేడాలొచ్చినా.. డైరెక్టర్స్ కు నో చెప్పేస్తున్నాడు. మహర్షి తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా అన్న మహేశ్.. స్క్రిప్ట్ సరిగా లేదని ఈ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టేశాడు. సుకుమార్ సినిమాను కూడా ఇదే కథలో తేడా వచ్చిందని సైడ్ చేశాడు. 

 

జడ్జిమెంట్ లో చిరంజీవి చాలా ఎక్స్ పర్ట్. 150 సినిమాల అనుభవంతో కథల రిజల్ట్ ని కరెక్ట్ గా కాలిక్యులేట్ చేస్తాడు. ఈ ఎక్స్ పీరియన్స్ తోనే పూరీ జగన్నాథ్ ఆటో జానీని షెడ్ కు పంపించాడు చిరు. కమ్ బ్యాక్ మూవీగా అనుకున్న ఆటో జానీ సెకండాఫ్ సెట్ అవ్వలేదని ప్రాజెక్ట్ కి బ్రేకులేశాడు. 

 

అల్లు అర్జున్ మార్కెట్ పెంచుకోవడానికి కొత్త కొత్త కథాంశాలను ఎంచుకుంటున్నాడు. సదరన్ స్టార్ గా సౌత్ మొత్తాన్ని ఇంప్రెస్ చేయడానికి యూనివర్శిల్ సబ్జెక్ట్ కే సైన్ చేస్తున్నాడు. అయితే ఈ సెలక్షన్ లోనే వచ్చిన ఐకాన్ ప్రాజెక్ట్ డిస్కషన్స్ లోనే ఆగిపోయింది. వేణు శ్రీరామ్ సెకండాఫ్ ని సరిగా సిద్ధం చేయలేదని ఈ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టేశాడు బన్నీ. 

 

సినిమాలు వందరోజులు ఆడటమే కాదు.. హీరోలు, హీరోయిన్ లు వంద సినిమాలు చేయడం కూడా గగనమైపోతోంది. జర్నీ మొత్తంలో హాఫ్ సెంచరీ క్రాస్ చేస్తే గొప్ప అన్నట్టు తయారవుతోంది పరిస్థితి. అందుకే చేసిన తక్కువ సినిమాలు అయినా కెరీర్ లో మెమరబుల్ గా ఉండాలనుకుంటున్నారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: