చైనా వాళ్ళు చేసిన మహత్తరమైన కార్యంతో కరోనా పుట్టి మహమ్మారిగా దేశ వ్యాప్తంగా అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. దేశ దేశాలు ఈ కరోనాతో ప్రాణ భయంతో హడలిపోతున్న సంగతి కూడా తెలిసిందే. చిన్న వ్యాపారుల దగ్గర్నుంచి, వందల కొట్ల లో వ్యాపారాలు చేసేవాళ్ళ దాకా అందరికి ఈ ప్రభావం గట్టిగా పడింది. ఇప్పటికే వందల కోట్లలో నష్టం వాటిల్లింది. ఇక సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఊహించలేనంతగా ప్రభావ్మ్ చూపించింది.

 

కరోనా ఎఫెక్ట్ తో మల్టీ ఫ్లెక్సులు థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. నిర్మాతల మండలి సూచన మేరకు చిత్ర పరిశ్రమ షూటింగులను ఉన్న పలంగా నిలిచేశారు. టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్ని తమ షూటింగ్ లను నిలిపి వేయగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. అందుకే ఆయా సినిమాల కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిలిపి వేశారు. కరోనా పరిస్థితులు మారేలా కనిపించకపోవడం తో మార్చి 25న రిలీజ్ కావాల్సిన సినిమాలు ఏప్రిల్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గే సూచనలు లేకపోవడంతో ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న సినిమాలను కూడా తరువాతి వారాలకు వాయిదా వేయబోతున్నట్లు ప్రకటించాయి.

 

అయితే తాజా పరిస్థితులు చూస్తే ఏప్రిల్ లో కూడా థియేటర్స్ తెరుచుకునేలా కనిపించడంలేదు. ఒకవేళ ఓపెన్ చేసినా విడుదలకు నోచుకోని చిన్న సినిమాలన్నీ ఒకేసారి క్యూ కట్టే అవకాశం ఉంది. దీని వల్ల ఏ సినిమా కూడా లాంగ్ రన్ లో కలెక్షన్స్ రాబట్టే అవకాశమే లేదు. దీంతో ఇండస్ట్రీకి పెద్ద నష్టం జరిగే ఛాన్స్ ఉంది. అనుష్క నటించిన 'నిశ్శబ్దం' మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉప్పెన' నాని - సుధీర్ బాబు నటించిన 'వి' రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' లాంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నిర్మాతలు ఎక్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్స్ ఈ నెలాఖరు వరకు పరిస్థితులను బట్టి సినిమాల రిలీజ్ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఈ రకంగా చూస్తే కరోనా టాలీవుడ్ ని తరుముతూనే ఇంకో నెల వరకు ప్రభావం చూపిస్తుందనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: