కొంత మంది హీరోయిన్ల‌లో ఎంత వ‌య‌సువ‌చ్చినా ఆ అందం ఛ‌రిష్మా మాత్రం అలానే ఉంటుంది. ఎందువ‌ల్ల‌నో కాని ఫేస్‌లో ఆ గ్లో మాత్రం పోదు. నార్మ‌ల్ గా చెప్పాలంటే కొంత మందికి పెళ్ళై పిల్ల‌లు పుడితే చాలు శ‌రీరంలో చాలా మార్పులు రావ‌డ‌మే కాక దాంతో పాటు ఫేస్‌లో కూడా అంత‌గా గ్లో ఉండ‌దు. కొంతమందికి 30 ఏళ్ళు వ‌చ్చాయంటే చాలు అంటే మ‌ధ్య వ‌య‌సువారిని వెంట‌నే ఆంటీ అని అనేస్తారు.ఇక‌  50ఏళ్ళు వ‌చ్చాయంటే చాలు ఆంటీల‌క‌న్నా కూడా ముస‌లి వాళ్ళ‌లా క‌నిపించేస్తారు. వారి ముఖ క‌వ‌ళిక‌ల్లో వారి చ‌ర్మ సౌంద‌ర్యంలోగాని చాలా తేడాలు వ‌చ్చేస్తాయి. కొంత మందికైతే చ‌ర్మంలో కాస్త ముడ‌తులు మ‌రి కొంత మందికి చ‌ర్మం లూజ్‌నెస్ అనేవి వ‌చ్చేస్తాయి. అయితే మ‌రి అలా రాకుండా 50 ఏళ్ళు పైబ‌డినా కూడా స్టిల్ ఆ బ్యూటీనెస్‌ని అలాగే మెయిన్‌టెన్ చేసే హీరోయిన్ల గురించి మ‌నం ఇప్పుడు తెలుసుకుందాం. 

 

రోజా ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్ద్ జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మేకాక కొన్ని చిత్రాల్లో అప్పుడ‌ప్పుడు న‌టిస్తోంది. ఇక ప్ర‌స్తుత రాజ‌కియాల్లో కీల‌క పాత్ర పోషిస్తోంది రోజా. ఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తోంది. ఈమెకు ఇద్ద‌రు పిల్ల‌లు చెన్నైలో ఉంటారు. భ‌ర్త సెల్వారాఘ‌వ‌న్ ఒక పాప‌, బాబు ఉన్నారు. పాప అచ్చం రోజాలానే ఉంటుంది. ఈమె ఆ అమ్మాయిని కూడా హీరోయిన్‌గా తీసుకురావాల‌ని క‌ల‌లు కంటోంది రోజా. ఇక  ఈ విష‌యం ప‌క్క‌న పెడితే రోజా అందం అప్ప‌టికి ఇప్ప‌టికి ఎప్ప‌టికీ త‌ర‌గ‌లేద‌ని చెప్ప‌లేదు. రోజా ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. ఆమె అందం ఎప్పుడూ ఒకేలా ఉంది.

 

మీనాకి న‌ల‌భై మూడేళ్ళు.  చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈమె ఎన్నో చిత్రాల్లో అగ్ర క‌థానాయ‌కుల స‌రస‌న న‌టించి మంచి పేరు తెచ్చ‌కుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వెంక‌టేష్‌తో క‌లిసి దృశ్యం చిత్రంలో న‌టించి మెప్పించింది. ఈమె అందం కూడా దాదాపు అలానే ఉంద‌ని చెప్పాలి. 

 

రాశికి40 ఏళ్ళు ఈమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌రిచ‌య‌మై ఎన్నో చిత్రాల్లో న‌టించింది. సౌంద‌ర్య త‌ర్వాత అంత మంచి స్థానంలో రాశి ఒక‌ప్పుడు ఉండేది. ఆమె ఓ ద‌ర్శ‌కుడిని వివాహం చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు సినిమాల్లో న‌టించింది. త‌ర‌గ‌ని వ‌న్నె వ‌లె ఈమె అందం కూడా అలానే ఉంటుంద‌ని చెప్పాలి.

 

ఇక నాటి అందాల న‌టి ర‌మ్య‌కృష్ణ అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె ఏ పాత్ర‌లో న‌టించినా అద్భుత‌మైన ఎన్న‌టికి త‌ర‌గ‌ని అందం అంటే అది ర‌మ్య‌కృష్ణ‌దే అని చెప్పాలి. అల్ల‌రి ప్రియుడు, అల్ల‌రి మొగుడు ఇలా ఎన్నో చిత్రాల్లో త‌న న‌ట‌న‌, గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ భామ శివ‌గామి పాత్ర‌లో చించేసింద‌నే చెప్పాలి. ఎంత పెద్ద పాత్ర‌లో న‌టించినా ఆమె హుందాత‌నం అందం మాత్రం అలానే ఉంది. 

 

న‌దియ ఈమె కూడా ఒక‌ప్పుడు హీరోయిన్ పాత్ర‌ల్లో న‌టించింది. కానీ అప్ప‌టిక‌న్నా కూడా ఇప్పుడు ఈమెకు మంచి డిమాండ్ ఉంది దానికి కార‌ణం మోడ్ర‌మ్ అమ్మ‌, అత్త పాత్ర‌ల‌కు పెట్టింది పేరులా ఉంది న‌దియ అందం. యంగ్ అత్త‌, అమ్మ‌ల క్యారెక్ట‌ర్స్‌కి క‌రెక్ట్‌గా ఉంటుంది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే హీరోయిన్‌కి పోటీగా ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది న‌దియా అందం. మ‌రి యాభైఏళ్ళు పై బ‌డిన‌ప్ప‌టికీ వీరంద‌రూ మాత్రం స్టిల్ ఇప్ప‌టికీ బ్యూటీస్‌లా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. ఇక ఎవ‌రైనా వీరి వ‌య‌సు గురించి అడిగితే మాత్రం ఏకిప‌డేయాల‌న్నంత‌ల ఉంటుంది వీరి అందం.

మరింత సమాచారం తెలుసుకోండి: