మాస్ మహారా రవితేజ టాలీవుడ్ లో స్టార్ హీరోల తో పోటీ పడలేకపోతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా రవితేజ నటించిన సినిమాలన్ని ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. ఆ మధ్య సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపుడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సక్సస్ తో రవితేజ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చాడనుకున్నారు. అయితే అది ఒక్క సినిమాకే అని తర్వాత సినిమాలతో అర్థమైపోయింది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత వరస ప్లాపుల తో రేసులో వెనుకబడిన రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 

డాన్ శీను, బలుపు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సస్ లని అందుకున్న రవితేజ, గోపిచంద్ మలినేనిలు హ్యాట్రిక్ హిట్ కోసం క్రాక్ సినిమాని చేస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు రమేష్ వర్మ దర్శకత్వం లో 'కిలాడీ'అనే సినిమాని లైన్ లో పెట్టాడు రవితేజ. ఈ సినిమాకి కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇన్ని ఫ్లాపులున్న రవితేజ గురించి తాజాగా సినీ ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తుంది. మాస్ మహారాజ రెమ్యూనరేషన్ విషయంలో అసలు కాంఫ్రమైజ్ కావడం లేదట. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డిస్కోరాజా' బాక్సాఫీస్ చతికిల పడిన సంగతి తెలిసిందే. అయినా ఈ సినిమాకు రవితేజ భారీ మొత్తాన్నే వసూలు చేసాడని ఇండస్ట్రీలో చెప్పుకున్నారు. 

 

అదే విధంగా ప్రస్తుతం నటిస్తున్న క్రాక్ సినిమాకి కూడా దాదాపు 12 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడట. డిస్కోరాజా ఫ్లాపయిన తర్వాత కూడా రవితేజ అదే రేంజ్ రెమ్యూనరేషన్ ని నెక్స్ట్ సినిమాలకు డిమాండ్ చేస్తున్నాడంట. కోనేరు ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తున్న సినిమాకి కూడా దాదాపు 12 కోట్లు అడిగాడట. కొంత రెమ్యూనరేషన్ తగ్గించుకోమని మేకర్స్ రిక్వెస్ట్ చేసినా రవితేజ ఒప్పుకోవడం లేదట. వాస్తవానికి డిస్కోరాజా డిజాస్టర్ తర్వాత రవితేజ హిందీ రైట్స్ చాలా దారుణంగా పడిపోయాయట. అయినా రవితేజ రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం తో నెమ్మదిగా ఆయనతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ముందుకు రాకపోవచ్చునన్న టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: