టాలీవుడ్ పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లుగా  ఉంది. అసలే హిట్లు లేవు. పండుగలు పబ్బాలకే సినిమాలు రిలీజ్ చేసుకుని నాలుగు డబ్బులు చేసుకునే సీన్ కనిపిస్తోంది. పెద్ద హీరోలు సైతం పండుగ సీజన్లు, సెలవుల సీజన్ల మీదనే టార్గెట్ చేస్తున్నారంటేనే టాలీవుడ్ అసలైన  సినిమా ఏంటో అర్ధమైపోతుంది.

 

అటువంటిది బంగారు లాంటి సమ్మర్ సీజన్ ఇపుడు కరోనా దెబ్బకు పోతోంది. మార్చి నెలలో పరీక్షలు పెట్టి ఏప్రిల్ లో సెలవులు ఇస్తే జూన్ వరకూ మొత్తం మూడు నెలల పాటు టాలీవుడ్ కి పండుగే. పెద్ద చిన్న సినిమాలు నెలకు కనీసం పది వంతున మూడు నెలల్లో ముప్పై దాకా రిలీజ్ అవుతాయి. ఇందులో చాలా మటుకు ఒడ్డున పడే అవకాశం ఉంది.

 

ఆ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో లాభం చేకూతుంది. 24 క్రాఫ్టుల కార్మికులు చల్లగా ఉండడమే కాకుండా ఇండైరెక్ట్ గా కూడా వేలాది కుటుంబాలు బాగుంటాయి. ఇపుడు కరెక్ట్ గా కరోనా దెబ్బ సమ్మర్ సీజన్ మీద పడిందని అంటున్నారు. కరోనా ఇపుడు ఇండియాలో లేట్ గా మొదలైంది.

 

దాని ప్రభావం తక్కువలో తక్కువ నలభై రోజులు ఉండొచ్చని అంటున్నారు. అంటే అంతకాలం పూర్తి చేసిన సినిమాలు ఆపుకోవాలి. కొత్త సినిమాల షూటింగులూ వాయిదా వేసుకోవాలి. మరో వైపు సినిమా హాళ్ళు మూత వేసుకోవాలంటే ఇది చివరికి ఎటు దారితీస్తుందో అర్ధం కావడం లేదని అంటున్నారు.

 

ఇక పెద్ద బడ్జెట్ సినిమాలు కూడా రీ షెడ్యూల్ చేసుకుని మొదలుపెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. అంటే ఖర్చు తడిసి మోపెడ్ అవుతుందన్న మాట. మొత్తం మీద చూసుకుంటే కరోనా దెబ్బకు స్లంప్ వైపుగా టాలీవుడ్ ప్రయాణిస్తోందని అంటున్నారు. అసలే చిన్న సినిమాలకు ఊపిరి తక్కువ. వాటికి సమ్మర్ సీజన్ ఒక్కటే లైఫ్ ఇస్తుంది. దాన్ని కరోనా మింగేస్తే టాలీవుడ్లో సమీప భవిషత్తులో చిన్న సినిమాలు వెలుగు చూసే అవకాశాలు ఉండవని అంటున్నారు.

 


ఇక ఈ చిత్ర సీమను నమ్ముకుని బతికే వేలాది కార్మిక కుటుంబాలకు కూడా ఉపాధి లేక ఇబ్బందుల పాలు అవుతారని అంటున్నారు. సినిమా ఫ్లాప్ అయితే వచ్చే నష్టం వేరు. అదే సినిమా పరిశ్రమే పూర్తిగా  మూతపడే స్టేజికి వస్తే ఇక దారుణాలే జరుగుతాయని అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: