కరోనా వైరస్.. ఎంత పెద్ద రక్షేసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ మమహమ్మారీ వల్ల ఎందరో ప్రాణాలు గాల్లోకి కలిసిపోయాయి అంటే నమ్మండి. ఎందురో ఈ వ్యాధి భారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇంకా అలాంటి ఈ వైరస్ ప్రపంచ దేశాలు అన్ని చుట్టేసి భారత దేశానికి కు చేరింది. దీంతో ఆ వైరస్ చాప కింద నీరులా వ్యాపించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. 

 

రాష్ట్ర ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వం నిత్యం ప్రజలను జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తుంది. అంతే కాదు మూడు రోజుల ముందు మీడియా ముందుకు వచ్చిన మోదీ సర్కార్ ఈ వైరస్ పై సంచలన వ్యాఖ్యలు.. అంతే కాదు ఈ వైరస్ నియంత్రణ కోసం అయన ప్రజల కాలంలో కొన్ని గంటలు ఇవ్వాలి అని కోరారు.. అంటే 22 మార్చ్ ఆదివారం ఉదయం 7 నుండి రాత్రి 9వరుకు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలి అని మోదీ సూచించారు. 

 

అయితే ప్రధాని మోదీ పిలుపు మేరకు సెలబ్రెటీలందరు కూడా జనతా కర్ఫ్యూకి సపోర్ట్ చేస్తూ.. ప్రజలకు వారి పద్దతిలో అవగాహనా కల్పిస్తున్నారు.. నాలుగురైన బయటకు రాకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు పూరి జగన్నాద్ విచిత్ర పద్దతిలో ప్రజలకు అవగాహనా కలిపించాడు.. ఆదివారం బయటకు వెళ్ళకూడదు అని చెప్పాడు. 

 

విచిత్ర పద్ధతి అంటే ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. విచిత్ర పద్ధతి అంటే ఏంటో కాదు.. ఇంతమంది సెలబ్రెటీలు.. రాజకీయనాయకులు.. అధికారులు అందరూ కూడా ఆదివారం కేవలం 14 గంటలు ఇంట్లో ఉండండి చాలు అని అంటే.. కొందరు నీచులు మాత్రం ఆదివారం ఇంట్లో ఉండాలా ? మావల్ల కాదు అని అంటుంటారు.. అలాంటి వాళ్లకు పూరి గట్టి దెబ్బ ఇచ్చాడు.. ట్విట్టర్ వేదికగా వారిని ఓ ఆట ఆదుకున్నాడు.. 

 

అసలు పూరి జగన్నాథ్ ఎం అన్నాడు అంటే.. ''ఎందుకు చెప్పారో.. మన ప్రధానమంత్రిగారు చెప్పిన మాట విందాం. ఆదివారం అందరం ఇంట్లోనే ఉందాం. ఇలా ఉంటే ఆ కరోనా వైరస్ తాలుకూ చైన్ కట్ అవుతుందని పెద్దలందరి అభిప్రాయం. సో.. వారి మాటను గౌరవించి ఇంట్లోనే ఉందాం. ఈవాళ కరోనా లేని ప్లేస్‌లోకి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే.. ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు ఏంటంటే వూహాన్. చైనాలో కరోనా వస్తే.. కంట్రీ మొత్తం కట్టగట్టుకుని కరోనాని చావకొట్టారు. సో.. మనం కూడా ఆ పని చేయాలనుకుంటే.. చెప్పిన మాట వినండి. కొంత మంది నేను ఇంట్లో ఉండలేను అని నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకి, ఫ్రస్టేట్ అయ్యేవాళ్లకి నా సలహా ఏమిటంటే.. ఆదివారం ఉదయం లేవగానే నాలుగు స్ఫూన్లు ఆముదం తాగండి. మోషన్స్ అవుతాయి. ఇక ఆ పనిలో బిజీగా ఉంటారు. సాయంత్రం అయిపోతది. హ్యాపీగా ఉంటది. సో.. ఇలాంటి టైమ్‌లో నెగిటివ్‌గా లేకుండా చెప్పిన మాట వినండి. రేపందరూ ఇంట్లోనే ఉండండి. లవ్ యు ఆల్'' అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: