టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కొనసాగుతుంది.. ఇక్కడ పడక సుఖం అందిస్తేనే సినిమా ఛాన్సులు లేదంటే గేటు బయటే అని సంచలన వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి.  రెండేళ్ల క్రితం ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది.  బాలీవుడ్ లో మీ టూ ఉద్యమంగా కొనసాగింది.  హీరోయిన్లు చాలా మంది గతంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి గళం విప్పారు.  చాలా కాలం తర్వాత కాస్టింగ్ కౌచ్ గురించి నటి అనుష్క నోరు విప్పారు.  ప్రస్తుతం అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు.  ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేద‌ని తాను చెప్ప‌న‌ని, కానీ అదృష్ట వ‌శాత్తు త‌న‌కు అలాంటి అనుభ‌వం ఎదుర‌వ్వ‌లేద‌ని, కార‌ణం తాను ముక్కుసూటిగా మాట్లాడుతుంటాన‌ని, ఎప్పుడైతే స్త్రీ నో అని చెబుతుందో అప్పుడే పురుషుడు మ‌హిళ‌ల్ని గౌర‌వించ‌డం మొద‌లుపెడ‌తాడ‌ని వెల్ల‌డించింది.

 

కొంతమంది బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి దుర్మార్గులు ఎక్కడైనా ఉంటారు.. సినీ పరిశ్రమ అని ఒక్కటే చెప్పలేం.. ఎక్కడైనా మహిళలు ఈ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  అయితే తాము ఏ బలహీనతలకు లొంగకుండా ఎదురు తిరిగిరితే ఇలాంటివి ఎదుర్కోవొచ్చు అని అన్నారు.  ఇక తన పెళ్లిపై వస్తున్న వార్తలు విని వినీ తనకు బోర్ కొట్టిందని.. ఇలాంటి వార్త‌ల్ని ఎలా రాస్తారో త‌న‌కు అర్థం కాలేద‌ని, వ‌దంతుల‌నేవి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో సాధార‌ణం.

 

ఈ విష‌యంలో తానేవీ చేయ‌లేన‌ని, త‌న‌పై ఇలాంటి వార్త‌లు రాసేవారికి  అక్కాచెల్లెల్లు వుండ‌రా అని ఆశ్చ‌ర్య‌పోతుంటా అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.  తన పని తాను చేసుకుంటూ వెళ్తానని.. తర్వాత లోకం అంతా తన కుటుంబమే అని తన కుటుంబం తనకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. నుష్క ప్ర‌స్తుతం `నిశ్శబ్దం` మూవీలో న‌టిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో కోన వెంక‌ట్‌తో క‌లిసి టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: