ఈరోజు ఉదయం నుండి భారతదేశంలోని 130 కోట్ల ప్రజానీకం ప్రధానమంత్రి మోడీ పిలుపుతో స్వచ్చందంగా ‘జనతా కర్ఫ్యూ’ ను పాటిస్తూ ఎవరికి వారు తమ ఇంట్లోనే ఉంటూ కరోనా పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం దేశం యావత్తు తమ గుమ్మాలలో నిలబడి చప్పట్లు సభ్దాలు చేస్తూ కరోనా ని భయపెట్టి ఈదేశం నుండి శాస్వితంగా తరిమివేయాలని ధృఢ నిశ్చయంతో ఉంది.


ఇటువంటి సమయంలో గాయని సునీత పై వచ్చిన ఒక ఫేక్ న్యూస్ ఈరోజు ఉదయమే అందరికీ షాక్ ఇచ్చింది. ఈమధ్య కాలంలో మీడియాకు దూరంగా ఉంటున్న సునీత ఈరోజు ఉదయం తన ట్విటర్ పేజీ ద్వారా తెలంగాణ ప్రభుత్వ సహాయాన్ని అడగడం సంచలనంగా మారింది. 


బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా వ్యాధి వచ్చినట్లుగా సింగర్ సునీతకు కూడ కరోనా లక్షణాలు వచ్చాయి అంటూ ఆమె పేరు పెట్టకుండా ఆమె ఫోటోను బ్లర్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఒక ఫేక్ న్యూస్ కొద్దిసేపు కలకలం సృష్టించింది. ఈ న్యూస్ సునీత దృష్టి వరకు వెళ్ళడంతో ఎలర్ట్ అయిన సునీత అటువంటి ఫేక్ వీడియోను పెట్టిన వారిపై చర్యలు తీసుకోమని కోరుతూ తాను క్షేమంగానే ఉన్నాను అంటూ తన ట్విట్ లో పేర్కొంది.  


కరోనా వైరస్ గురించి ఫేక్ న్యూస్ లు ప్రచారంలోకి తీసుకు రావద్దు అంటూ ఒకటికి పది సార్లు ప్రభుత్వాలు పోలీసులు పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా ఇలాంటి ఫేక్ న్యూస్ లు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. సెలెబ్రెటీల దగ్గర నుండి సామాన్యుల వరకు అందరూ తమ దైనందిన జీవిత సమస్యల గురించి పట్టించుకోకుండా కేవలం తెల్లవారితేచాలు కరోనా గురించి మాత్రమే వార్తలు వింటున్న పరిస్థితులలో ఇలాంటి ఫేక్ న్యూస్ లు రానున్న రోజులలో ఇంకా చాల సందడి చేసే ఆస్కారం కనిపిస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: