కరోనా ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజల్లో అవేర్‌ నెస్‌ కలిగించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా వ్యక్తిగతంగా తమ వంతు సాయం చేసుందుకు ముందుకు వస్తున్నారు. తమ ఫాలోవర్స్, అభిమానులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనల చేస్తున్నారు. పోలీసులు కూడా ఈ కష్టకాలంలో తమ శక్తి వంచన లేకుండా ప్రజారోగ్యం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.

 

పార్వతీపురం సర్కిల్ కు చెందిన పోలీసులు అల వైకుంఠపురములో సినిమాలోని ఓ మ్యూజిక్‌ బిట్‌కు డ్యాన్స్‌ చేస్తూ షేక్ హ్యాండ్‌ ఇవ్వొద్దు, చేతులు ఎలా కడుక్కోవాలి లాంటి విషయాలను తెలియజేస్తూ డ్యాన్స్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ వీడియోపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇంట్రస్టింగ్‌ గా స్పందించాడు.

 

`ప్రస్తుతం భారీ విపత్తును ఎదుర్కొంటున్న సమయంతో నేను పోలీసుల శక్తిని చూడాలనుకుంటున్నా.. ఈ టైంలో వాళ్లు ఇలా సంపూర్ణేష్ బాబు లా బఫూన్‌ లలా ప్రవర్తించ వద్దని కోరుతున్నా. ఈ పరిస్థితులపై సీరియస్‌గా స్పందించాలి. కామెడీ అనిపించకూడదు.` అంటూ కామెంట్‌ చేశాడు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: