కరోనా ఎఫెక్ట్ తో సినిమాలు అన్నీ వాయిదా పడటంతో ఏప్రిల్ లో విడుదల కావలసిన సినిమాల పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగి ఏప్రిల్ లో ధియేటర్లు ఓపెన్ అయినా ఇప్పటికే రిలీజ్ కు లైన్ కట్టి క్యూలో ఉన్న సినిమాలలో ఎన్ని సినిమాలు ఏప్రిల్ లో విడుదల అవుతాయో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. 


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉప్పెన’ కు పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఆమూవీ అల్లు అర్జున్ సెంటిమెంట్ ను నమ్ముకోవడం ఆశ్చర్యంగా మారింది. వాస్తవానికి ఈ మూవీని ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేయాలని మొదట్లో భావించారు. 


ఆ మూవీతో అనుష్క ‘నిశ్శబ్దం’ పోటీ పడుతున్నా పట్టించుకోకుండా సాహసం చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ మారిన వాతావరణ పరిస్థితులలో మే నెల 7వ తారీఖుకు వాయిదా వేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏప్రిల్ నెల అంతా అనేక సినిమాలు క్యూ కడుతున్న పరిస్థితులలో ఈ మూవీ అన్ని సినిమాల మధ్య విడుదల చేయడం మంచిది కాదు అన్న ఉద్దేశ్యం ఒకటి అయితే మరొక కారణంగా అల్లు అర్జున్ లక్కీ సెంటిమెంట్ కూడ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. 


అల్లు అర్జున్ కెరియర్ లో ‘ఆర్య’ మూవీకి ఒక ప్రముఖ స్థానం ఉండటమే కాకుండా ఈమూవీ తరువాత బన్నీ గ్రాఫ్ హీరోగా బాగా పెరిగింది. ఈ మూవీ గతంలో మే 7న విడుదలై ఘన విజయం సాధించిన పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని ఈమూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీస్ భావిస్తున్నట్లు టాక్. దీనితో బన్నీ లక్ వైష్ణవ్ తేజ్ కు ఎలా కలిసి వస్తుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు అన్నీ విడుదలై బాగా హిట్ అయిన పరిస్థితులలో ఈమూవీ పై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలు బాగా పెరుగుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: