తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కొనసాగుతూ ప్రస్తుతం స్టార్ హీరోలందరి సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి... తన క్యూట్ క్యూట్ అందాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ... తన నటనతో దర్శక నిర్మాతలు అందరినీ ఆకర్షిస్తూ... వరుస అవకాశాలతో చేజిక్కించుకుంటూ  దూసుకుపోతుంది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం తీరిక లేనంత బిజీ గా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇక టాలీవుడ్లో సక్సెస్ రేటు బాగా ఉండటంతో వరుస  అవకాశాలు వచ్చి ఈ అమ్మడికి ఎంత వాలుతున్నాయి. ఇక అటు బాలీవుడ్ నుంచి కూడా ఈ అమ్మడికి భారీగానే ఆఫర్లు వస్తున్నాయి. 

 

 

 ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ఎన్టీఆర్ ఇలా చాలామంది స్టార్ హీరోల తో నటించి మంచి విజయాలను సొంతం చేసుకుని దూసుకుపోతున్న ఈ అమ్మడు... ప్రస్తుతం ప్రభాస్ ఎన్టీఆర్ సల్మాన్ఖాన్ లాంటి హీరోల ప్రక్కన ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ తమ్ముడు సినిమాల లిస్టులో మరో హీరో సినిమా  చేరిపోయింది. ఇప్పటికే వరుస అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ ముద్దుగుమ్మ... పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది అంటూ కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న వకీల్ సాబ్  సినిమాలో లేదా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న మరో పెద్ద సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతుంది టాక్ వినిపిస్తోంది. 

 

 

ఇక ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని రకాలుగా క్లారిటీ వచ్చేసిందట. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ సరసన నటించేందుకు ఫైనల్ చేస్తున్నారని తాజా సమాచారం. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు... ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్... క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలు పూర్తయ్యే సమయానికి పూజా హెగ్డే కాల్షీట్లు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందట. ఇక ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ సరసన కూడా మరోసారి నడిచేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో పూజా హెగ్డే సుడి మామూలుగా లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: