అల్లు అర్జున్ కు ఇండస్ట్రీ హిట్ ఇవ్వాలి అన్న అరవింద్ కోరిక ‘అల వైకుంఠపురములో’ మూవీతో తీరింది. ఈ మూవీని తీర్చి దిద్దింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అయినప్పటికీ ఈ మూవీ కథ విషయంలో ముఖ్యంగా ఎడిటింగ్ విషయంలో ఇలా ప్రతి విషయంలోనూ అరవింద్మూవీ మేకింగ్ విషయంలో అనేక సలహాలను ఇచ్చాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. 


దీనికితోడు ఎప్పుడు ఓపెన్ గా తన తండ్రిని పొగుడ్తూ కామెంట్స్ చేసే అలవాటు లేని అల్లు అర్జున్ ఏకంగా ‘అల’ ప్రీ రిలీజ్ మీట్ లో తన తండ్రికి పద్మశ్రీ పురస్కారం రావాలి అంటూ భావోద్వేగానికి గురి కావడంతో ఈమధ్య కాలంలో బన్నీ అరవింద్ ల మధ్య మరింత ప్రేమానురాగాలు పెరిగాయా అనే సందేహాలు చాలామందికి కలిగాయి. ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా అల్లు అర్జున్ ఒక దర్శకుడు మాటలకు బుట్టలో పడకపోతే అరవింద్ ఇచ్చిన హెచ్చరికలతో ఆ దర్శకుడి ఒత్తిడి నుండి బయటపడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం సుకుమార్ సినిమా షూటింగ్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న బన్నీని తమిళ దర్శకుడు మురగదాసు కలిసి ఒక కథ చెప్పడమే కాకుండా ఆ కథలో నటించడానికి బన్నీ ఒప్పుకుంటే ఆ మూవీని తెలుగు తమిళ భాషలలో ఒకేసారి నిర్మిస్తాను అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు టాక్. అల్లు అర్జున్ కు ఎప్పటి నుండో కోలీవుడ్ మార్కెట్ పై బాగా ఆశ ఉండటంతో మురగదాస్ చెప్పిన కథకు బన్నీ బుట్టలో పడ్డాడు అని తెలుస్తోంది.


అయితే ఈ విషయాలు తెలుసుకున్న అరవింద్ వెంటనే సీన్ లోకి ఎంటర్ అయి మురగదాస్ చెప్పిన కథ వినడమే కాకుండా ఆ కథ బన్నీకి ఏమాత్రం సరిపోదు అని తేల్చి చెప్పినట్లు టాక్. దీనికితోడు ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మురగదాస్ రజినీకాంత్ మూవీ ‘దర్బార్’ ఫెయిల్ కావడంతో ప్రస్తుతం క్రేజ్ తగ్గిన మురగదాస్ మూవీలో నటించడం వల్ల బన్నీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఉండదని గ్రహించి ఈ ప్రాజెక్ట్ విషయమై బన్నీకి స్పష్టమైన సలహాలు ఇచ్చినట్లు గాసిప్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం మురగదాస్ దృష్టి వరకు వెళ్ళడంతో షాక్ అయిన మురగదాస్ తమిళ హీరో విజయ్ తో ‘తుపాకీ 2’ సీక్వెల్ ను తీసే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: