జనతా కర్ఫ్యూకి  సెలబ్రిటీలందరూ మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు.  తమ వంతు బాధ్యతగా అందరికీ ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. 
కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు  జనతా కర్ఫ్యూకి అందరం సపోర్ట్ చేద్దామని అన్నారు హీరో మంచు మనోజ్. అ లాగే పెంపుడు జంతువుల వల్ల కరోనా వైరస్ రాదని, వాటిని వదిలిపెట్టవద్దని ఆయన ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు.  ఆయన మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్ గురించి ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది. అది చాలా చాలా డేంజరస్. దానిని తేలికగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదిది. ముఖ్యంగా కరోనా వైరస్ మన దగ్గరకు రాకుండా ఉండాలంటే మనం శుభ్రంగా చేతులు ఒకటికి 10 సార్లు కడుక్కోవాలి. 

మనిషి మనిషికి దూరం దూరం ఉండాలి. గుంపులుగా టీ షాపుల దగ్గర, మందుల షాపుల దగ్గర, వస్తువులు కొనేచోట.. ఇలా ఎక్కడైనా సరే గుంపులు గుంపులుగా ఉండకుండా.. ఇంట్లో ఉండడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఇది అందరికీ వ్యాపించే వైరస్. చిన్నా, పెద్ద అనే తేడాలు ఉండవు. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మనం పెంచుకునే జంతువుల వల్ల కరోనా వైరస్ రాదని నిరూపించబడింది. చాలా మంది పెంపుడు జంతువులను బయట పెట్టేస్తున్నారు. పెంపుడు జంతువుల వల్ల మనకి ఏం కాదు. సాటి మనిషి వల్లే ప్రాబ్లమ్. 14 గంటలు మనం ఇంటిలోనే ఉంటాం. ఆ వైరస్ లైఫ్ 12 గంటల వరకే ఉంటుందట. ఈ 12 గంటలు మనం ఎవ్వరం బయటికి రాకుండా ఉంటే చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వైరస్‌ విషయంలో ఎంతగానో ఫైట్ చేస్తున్న డాక్టర్లకి, పోలీసులకి అందరికీ నా ధన్యవాదాలు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అందరం మన వాకిట్లోకి వచ్చి చప్పట్లతో వారికి జేజేలు పలుకుదాం. మనుషులంతా ఒకటి అని నిరూపిద్దాం. అందరం ఒకేమాట మీద ఉండి వైరస్ నిర్మూలనకు సహకరిద్దాం. ధన్యవాదాలు..’’ అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: