క‌రోనా వైర‌స్ తో గత రెండు నెలలుగా 130కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్క పౌరుడు దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ను తన విపత్తు గా భావించి.  ప్రతిఒక్కరూ తనకు చేతనైనంతగా సేవలందించారు.  మున్ముందు కూడా ప్ర‌తిఒక్క‌రూ త‌మ‌ కర్తవ్యాలను నిర్వహిస్తారని, బాధ్యతలను నెరవేరుస్తారని సెల‌బ్రెటీల సైతం ఈ వైర‌స్ గురించి ఎంతో బాధ్య‌త‌తో వారి సోష‌ల్ మీడియాల ద్వారా దేశ ప్ర‌జ‌ల‌ను మేల్కొల్పుతున్నారు.  ఇటువంటి సమయాలలో కొన్ని ఇబ్బందులు రావడం సహజం.  కొన్ని వదంతులు వ్యాపించి వాతావరణమంతా విచిత్రంగా మారిపోవచ్చు.  కొన్నిసార్లు పౌరుడి గా మన కోరికలు కొన్ని తీరకపోవచ్చు.  ఏది ఏమైనప్పటికి, ఈ విపత్కర సమయం లో దేశ ప్రజలందరూ ఈ కష్టాల మధ్యలోనే దృఢసంకల్పం తో ఇబ్బందులన్నింటిని ఎదుర్కోవాలని ఇటు ప్ర‌భుత్వాలు అటు సెల‌బ్రెటీలు గొంతెత్తి చెపుతున్నారు. 

 

వర‌ల్డ్ వైడ్‌గా క‌రోనా వైర‌స్ వ‌ల‌యాన్ని సృష్టిస్తున్న సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా అల‌ర్ట్‌ని ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఇందులో భాగంగా ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 9 గంట‌ల వ‌ర‌కు 14 గంట‌ల పాటు జ‌న‌తా క‌ర్ఫ్యూ పాటించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌ధాని పిలుపుకు మ‌ద్ద‌తుగా సినీ తార‌లంతా ముందుకు వ‌చ్చారు. అంతే కాకుండా భార‌తీయులంతా దీనికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని, స్వ‌చ్ఛందంగా రావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జ‌న‌తా క‌ర్ఫ్యూ ని విజ‌య‌వంతం చేయ‌డంలో భాగంగా త‌మ వంతు బాధ్య‌త‌గా స్టార్స్ ఇన్ స్టాలో 14 గంట‌ల పాటు `మ‌నంద‌రి కోసం` అనే పేరుతో వినూత్న కార్య‌క్ర‌మానికి సిద్ధ‌మ‌య్యారు.

 

ఆదివారం ఉద‌యం 7గంట‌ల నుంచి రాత్రి 8:30 గంట‌ల వ‌ర‌కు మొత్తం 28 మంది తార‌లు ప్ర‌తీ అర‌గంట‌కు ఒక‌రు ఇన్ స్టా లైవ్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తున్నారు. ఉద‌యం 7 గంట‌ల‌కు మంచు ల‌క్ష్మితో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం రాత్రి రానాతో ముగించ‌నున్నారు. 7 గంట‌ల‌కు మంచు ల‌క్ష్మి, 8 గంట‌ల‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, 9 గంట‌ల‌కు ఇషారెబ్బా, 9:30 గంట‌ల‌కు రాజ్ త‌రుణ్‌, మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేష్‌, ఒంటి గంట‌కు స‌త్య‌దేవ్‌, సాయంత్రం 4 గంట‌ల‌కు నిహారిక‌, రాత్రి 7 గంట‌ల‌కు సుధీర్ బాబు, చివ‌ర‌గా రాత్రి 8:30 గంట‌ల‌కు రానా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించ‌నున్నారు. మ‌రి ఎంతో బాధ్య‌త‌గా వీరంద‌రూ మ‌న‌కోసం ఎంతో అభిమానంగా ప‌ల‌క‌రిస్తున్నందుకు సోష‌ల్‌మీడియాలో ఫ్యాన్స్ వీరికి హ్యాట్సాఫ్ చెపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: