మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం అంటే ఎగిరి గంతేసి సినిమా చేస్తారనేది తెలిసిన విషయమే. కానీ ఇటివలి పరిస్థితులు చూస్తుంటే హీరోయిన్ల కోసం మెగాస్టార్ చిరంజీవి పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ పరిస్థితి చిరంజీవితో పాటు ఇండస్ట్రీకి ఆయన అభిమానులకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితే. ఆచార్య సినిమాకు త్రిష ఇచ్చిన షాక్ మామూలుది కాదు. రజినీ పెట్టాలో త్రిష క్యారెక్టర్ చూసిన వాళ్లకు చిరంజీవి విషయంలో త్రిష తీసుకున్న నిర్ణయం విస్మయం కలిగించేదే.

 

 

చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా త్రిష తర్వాత అనుష్క పేరు బలంగా వినిపించింది. దాదాపు కన్ఫర్మ్ అవుతుందనుకున్న అనుష్క కూడా చిరంజీవికి హ్యాండ్ ఇచ్చింది. చూస్తుంటే మెగాస్టార్ సినిమాలో అనుష్క కు ఇష్టం లేదా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 14ఏళ్ల క్రితం వచ్చిన స్టాలిన్ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది అనుష్క. 13ఏళ్ల తర్వాత 2019లో సైరాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. సినిమాకు అనుష్క క్యారెక్టర్ ప్లస్ అయింది. కానీ చిరంజీవితో సీన్లు మాత్రం లేవు. ఇప్పటివరకూ పూర్తిస్థాయి హీరోయిన్ గా చిరంజీవి సినిమాలో చేయని అనుష్క ఇప్పుడు ఆచార్య ద్వారా అవకాశం వచ్చినా కాదనుకుంది. దీని వెనుక ఉన్న కారణాలు తెలీకపోయినా చిరంజీవి సినిమా అవకాశం మాత్రం వదులుకుంది.

 

 

వయసు దృష్ట్యా చిరంజీవితో సినిమా వదులుకుందా.. హీరోయిన్ గా పాటల్లో నటించే పాత్రలను వద్దనుకుంటుందా.., నిజంగా త్రిష చెప్పిన క్యారెక్టర్ డిఫరెన్స్ వల్ల ఆచార్యను వద్దనుకుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మెగా హీరోల్లో చిరంజీవికి మాత్రమే సూట్ అయ్యే అనుష్క ఈ అవకాశాన్ని వద్దనుకుంది. దీంతో మెగా క్యాంప్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ స్పెషల్ రోల్ వస్తే తప్ప అనుష్క హీరోయిన్ గా చేసే అవకాశం లేనట్టే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: