తెలుగు చిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం. లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై... కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సినిమాలో తన అందచందాలతో కూడా అందరినీ కవ్వించింది . ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడు కెరీర్ కు మంచి బాటలు పడ్డాయి  అనే చెప్పాలి. వరుస అవకాశాలు వచ్చి ఈ అమ్మడు చెంత  వాలిపోయాయి. దీంతో ఈ అమ్మడు ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి దశాబ్ద కాలం గడిచిపోతూనప్పటికి ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు . చందమామ లాంటి తన అందంతో... ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది... మరోవైపు తన హాట్ హాట్ అందాలతో ఎంతోమందిని కవ్వించింది ఈ ముద్దుగుమ్మ.

 


 ఇప్పటివరకు ఏ వివాదంలో లేకుండా ఎవరినీ నొప్పించని మనస్తత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. మొదట్లో గ్లామర్ పాత్రలో మెరిసిన ఈ అమ్మడు ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటుంది. అయితే తాజాగా కరుణ వైరస్ పై  స్పందించింది కాజల్ అగర్వాల్. కరోనా  వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అయితే ప్రస్తుతం భారత దేశ ప్రజలందరికీ కరోనా  వైరస్ భయం పట్టుకున్న  విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలను అమలు చేసినప్పటికీ కరోనా  కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. 

 


 అయితే ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా వైరస్ విజృంభణ పై స్పందిస్తూ... తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తమ తమ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరికీ సూచించిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఇక కాజల్ అగర్వాల్ కూడా తన వంతుగా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి పలు సమాచారాన్ని తెలియజేసింది. కరోనా వైరస్  కుక్కల ద్వారా వ్యాపించదు అంటూ తెలుపుతూ ఓ  పోస్టర్ ను  అభిమానులతో పంచుకున్నది  కాజల్ అగర్వాల్. కరోనా  వైరస్ సోకుతుంది అనే కారణంతో మూగజీవాలను దూరం పెట్టకండి అంటూ సూచించింది. అయితే గత కొంత కాలంగా కుక్కల కారణంగా కరోనా వైరస్ సోకుతుంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: