ప్రపంచాన్ని భయపెట్టిన  కరోనా మహ్మమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు విశేష స్పందన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. ఒక్క అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి...ఎక్కడ జన సంచారం లేదన్న విషయం తెలిసిందే.. రవాణా వ్యవస్థ కూడా ఈ మేరకు పూర్తిగా స్తంభించి పోయింది..

 

 

 

ఇక మోదీ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సెలెబ్రెటీలు వారి సోషల్  మద్యమాల ద్వారా తెలుపుతూ వస్తున్నారు.. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ కరోనా పారిపోయెలా గతంలో నమస్తే పాటను పాడి ప్రేక్షకుల మనను కొల్లగొట్టారు.. అతని క్రేజ్ పాటలో ఉన్న దమ్మ పరిస్థితులు ఆ పాటకు మంచి స్పందన తో పాటుగా నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంది.

 

 

 

కాగా... తాజాగా జనతా కర్ఫ్యూపై ఓ ప్రత్యేకమైన పాటను అలపించారు. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఐటీ కంపెనీలతోపాటు పలు ఉద్యోగ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబా సెహగల్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇచ్చినప్పుడు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. మంచి ఆహారం తీసుకుని.. సరదాగా ఇంట్లో ఉండండి అని చెబుతూనే.. ‘కరోనా.. గో.. గో.. గోనా’ అని పేర్కొంటూ ఓ ప్రత్యేకమైన పాటను అలపించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది..

 

 

భారత దేశంలో కరోనా రోజురోజూకీ విపరీతంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలకు ‘కొవిడ్‌-19’పై అవగాహన కల్పించే విధంగా ఇటీవల బాబా సెహగల్‌ ‘నమస్తే’ అంటూ సాగే ఓ పాటను అలపించిన విషయం తెలిసిందే. ‘కరోనా చాలా సున్నితమైన అంశం కాబట్టి దానిపై ఎలాంటి పాటను చేయకూడదనుకున్నాను. కాకపోతే ప్రిన్స్‌ ఛార్లెస్‌ నమస్తే పెట్టడం చూశాక.. ‘నమస్తే’ పాటను రూపొందించాను’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.మోదీ తీసుకొచ్చిన నిర్ణయానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు...

 

">

మరింత సమాచారం తెలుసుకోండి: