టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది సంగీత దర్శకులు తమ మధురమైన సంగీతంతో ప్రేక్షకులు మంత్ర ముగ్దులను చేశారు.  ఇప్పటికీ కొన్ని పాటలు ఎవర్ గ్రీన్ గా ఉన్న విషయం తెలిసిందే.  ఇటీవల సంగీత దర్శకులు అంటే కీరవాణి, మణిశర్మ, దేవీశ్రీ ప్రసాద్, తమన్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి.  శంకర్ దర్శకత్వంలో బాయ్స్ సినిమాలో నటించిన తమన్ తర్వాత సంగీత దర్శకుడిగా మారాడు.  తమన్ సంగీతం లో ప్రతిసారి ఒక నూతనత్వం కనిపిస్తుంది. అప్పట్లో తమన్ సంగీతంలో ఎప్పుడూ కాపీ ఉంటుందనీ.. హాలీవుడ్ మ్యూజిక్ ని కాపీ కొట్టి దానికి ఏదో పూతలు పూస్తుంటారని కామెంట్స్ వినిపించింది. 

 

ఇదే సమయంలో దేవీ శ్రీప్రసాద్ మంచి మాస్ బీట్ సాంగ్స్, మెలోడీ, క్లాసిక్ ఇలా అన్ని రకాలుగా తన మ్యూజిక్ తో మాయ చేశాడు. ఇదే సమయంలో తమన్ ఎంట్రీ ఇచ్చి తన మ్యూజిక్ తో దేవీ తో పోటీ పడుతూ వచ్చాడు.     ఇటీవల 'అల వైకుంఠపురములో' సినిమాకి ఆయన అందించిన బాణీలు జనంలోకి బాగా వెళ్లాయి. ముఖ్యంగా 'సామజ వర గమన' అనే పాట సోషల్ మీడియాలో రికార్డుస్థాయి వ్యూస్ ను దక్కించుకుంది. యూట్యూబ్ లో సంచలన రికార్డులు క్రియేట్ చేశాయి.  ఈ పాట బయటికి వచ్చినప్పుడే ఈ ట్యూన్ కాపీ అనే ప్రచారం జరిగింది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను కంపోజ్ చేసిన సామజవరగమన సాంగ్ ట్యూన్ కాపీ చేసిందని అంటున్నారు. 

 

ఒక మంచి సాంగ్ రూపొందటానికి నా ఒక్కడి కృషి మాత్రమే కాదు.. దాని వెనుక మా టీమ్ అంతా కష్టపడ్డారు.  ఇలాంటివి అన్నీ ఎలా పుట్టిస్తుంటారో అస్సలు అర్థం కాదని అన్నారు. ఇది కాపీ ట్యూన్ అని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేశారు. అలాంటివాళ్లకి చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకంటే కాపీ ట్యూన్ ను ఈ స్థాయిలో ఎవరూ రిసీవ్ చేసుకోరు. ఈ ట్యూన్ కి వచ్చిన రెస్పాన్స్ నే, ఇలాంటి ప్రచారం చేసేవారికి సమాధానమని అనుకోవచ్చు" అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: