నాచురల్ స్టార్ నాని ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న వి సినిమాపై కొత్త న్యూస్ ఆడియెన్స్ ను సర్ ప్రయిజ్ చేస్తుంది. సినిమాలో నానితో పాటుగా సుధీర్ బాబు కూడా నటించారు. నాని పూర్తిస్థాయిలో నెగటివ్ రోల్ లో నటించిన ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. సినిమా టీజర్ అంచనాలు పెంచగా అసలైతే దసరాకి రావాల్సిన ఈ సినిమా వాయిదా వేశారు. ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. 

 

ఇదిలాఉంటే ఈ సినిమా కథ నాని, సుధీర్ బాబు కోసం కాదు పవన్ కళ్యాణ్, మహేష్ కోసం రాసుకున్నాడట మోహనకృష్ణ. అప్పట్లో మహేష్ కు కథ కూడా వినిపించాడని వార్తలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ మహేష్, పవన్  చేయాల్సిన కథ నాని, సుధీర్ బాబులు చేశారు. ఒకవేళ మహెష్, పవన్ ఓకే చెబితే అందులో నెగటివ్ రోల్ ఎవరు చేసేవారు అన్నది కూడా ఎక్సయిటింగ్ అనిపిస్తుంది. ఒకవేళ సినిమా హిట్టై ఈ కథ పెద్ద స్టార్స్ తీసినా బాగుండేది అన్న టాక్ వస్తే మాత్రం మహేష్ మంచి ఛాన్స్ మిస్ అయినట్టే లెక్క. 

 

మహేష్ కు కథ చెప్పిన మోహనకృష్ణ అతను ఓకే అంటే పవన్ కు స్క్రిప్ట్ వినిపించేవాడు. కానీ మహేష్ దగ్గరే కథ ఆగడంతో ప్రాజెక్ట్ లేట్ అవుతుందన్న కారణంతో నానితో కానిచ్చేశాడు. సుధీర్ బాబు కూడా ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా కథ ప్రకారంగా చూస్తే సుధీర్ బాబే హీరోగా కనిపిస్తాడని అంటున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: