ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ ఎఫెక్ట్ జనాలకు నిద్ర పట్టకుండా చేస్తుంది.  ఈ భయంకరమైన వైరస్ తో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ దిక్కుమాలిన వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది.  కరోనా మహమ్మారి ఇటలీపై పగబట్టింది. జనాల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేస్తోంది. మహోగ్ర రూపంతో విరుచుకుపడుతోంది.  ఈ మరణాలతో ఇటలీలో మృతుల సంఖ్య 4,825కు చేరింది. కరోనా వెలుగుచూసిన చైనాలోనూ ఇంతకంటే తక్కువ మరణాలు నమోదు కావడం గమనార్హం.  చైనాలో ఇప్పటి వరకు 3255 మంది మృతి చెందారు. గత రెండు రోజుల్లోనే ఇటలీలో 1420 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది. భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజు ప్రకటన చేసింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్న విషయం తెలిసిందే.   ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రోడ్లన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. ఇక కరోనా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ పార్వతీపురం పోలీసులు అల వైకుంఠపురములో పాటతో టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  తాజాగా ఈ విషయంపై సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విమర్శించారు.

 

  "పోలీసులు తామేం చేశారో తెలుసుకోలేకపోవచ్చు కానీ, బయటి నుంచి నాలాంటి ప్రజానీకం చూస్తుంటారు. సంపూర్ణేష్ బాబు తరహాలో ఇలాంటి బఫూన్ చేష్టలను చేయవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనా విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో పోలీస్ స్టామినా ఏంటో చూడాలనుకుంటున్నాను తప్ప ఇలాంటి జోకులను కాదు" అంటూ ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ని దరిచేరకుండా చేయాలంటే కొన్ని సూచనలు పాటించాలని వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: