కరోనా తన ఆటను నిరభ్యరంతగా ఆడుతూ వరుసగా వికెట్లను పడగొట్టుకుంటూ వెళ్లుతుంది.. దయ అనేది చూపించకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లుతుంది.. కరోనా దెబ్బకు ప్రభుత్వాలు తలలు పట్టుకుంటూ ఉండగా, ప్రజలు మాత్రం అల్లాడి పోతున్నారు.. అష్టకష్టాలు పడుతున్నారు.. ఇక రానున్న రోజుల్లో కరోనా ఇంకెన్ని దారుణాలు చేస్తుందో తెలియదు గానీ, త్వరగా వాక్సిన్ కనిపెట్టకపోతే ప్రపంచం శవాల గుట్టలుగా మారడం ఖాయమంటున్నారు అనుభవజ్ఞులు..

 

 

ఇకపోతే కరోనా కాటుకు మరో మనిషి బలైయ్యాడు.. గత కొద్ది రోజులుగా పార్కిన్‌సన్‌ అనే వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్‌ సోఫియా మైల్స్‌ తండ్రి పీటర్‌ మైల్స్‌(67) కరోనా బారిన పడి కన్నుమూశారు. అయితే ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనను ఆస్పత్రిలో జాయిన్ చేయగా చికిత్స పొందుతు కన్నుమూయగా, ఆ వ్యాధులతో పాటుగా కరోనా కూడా అతన్ని చుట్టుముట్టిందని తేలింది.. ఆయన వయస్సు పెద్దదైన కారణంగా తట్టుకోలేక ఇలా జరగగా.. తన తండ్రి మరణించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సోఫియా తన అభిమానులతో పంచుకున్నారు. ‘‘ ఆర్‌ఐపీ పీటర్‌ మైల్స్‌ . మా నాన్న కొన్ని గంటల క్రితమే మరణించారు. కరోనా వైరస్‌ కారణంగానే ఆయన చనిపోయార’ని పేర్కొన్నారు..

 

 

ఇక తన తండ్రి మరణించిన తర్వాత ఆసుపత్రిలో అతని మృతదేహం వద్ద దిగిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు.. ఇకపోతే ఇదివరకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన తండ్రి  ఆరోగ్య పరిస్థితుల గురించి అభిమానులకు తెలియజేస్తున్న సోఫీయా కొద్దిరోజుల క్రితం ఓ వీడియోను కూడా విడుదల చేశారు.. కాగా ‘అందరినీ హెచ్చరిస్తున్నాను. కరోనా వ్యాధి సోకిన మా నాన్న ప్రత్యేక వార్డులో ఉంచబడ్డారు. అక్కడ అందరూ కరోనా బాధితులే. ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. వారిలో అందరూ వృద్ధులే. దయచేసి కరోనాను సీరియస్‌గా తీసుకోండని ఆ వీడియాలో విజ్ఞప్తి చేశారు.

 

 

కాగా, యూకేలో ఇప్పటివరకు 5,018 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు 233 మంది మరణించారు... ఇక ఇప్పటికైన తగిన జాగ్రత్తలు చేపట్టకపోతే ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది... ముఖ్యంగా వృద్ధులకు మాత్రం ఈ కరోనా యమపాశంలా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: