విక్రమ్ కుమార్ అంటే ప్రయోగాలకి కేరాఫ్ అడ్రస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన ప్రయోగాలన్ని సక్సస్ అవడం లేదు. విక్రమ్ కుమార్ తీసిన మనం తప్ప మళ్ళీ ఆయన ఖాతాలో హిట్ అన్నది లేదు. తమిళంలో సూర్య తో తీసిన 24 కూడా ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత అక్కినేని హీరో అఖిల్ తో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన హలో సినిమా కూడా దారుణంగా ఫ్లాపయింది. అంతేకాదు నేచురల్ స్టార్ నాని తో రీసెంట్ గా తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా దారుణమైన పరాజయ్యాన్ని మూట గట్టుకుంది.

 

అయినా మరోసారి ప్రయోగం చేయడానికే సిద్దమవుతున్నాడు. అది కూడా మళ్ళీ అక్కినేని హీరోతోనే. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్, అలాగే రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాల తరహాలో నాగచైతన్యతో దర్శకుడు విక్రమ్ కుమార్ ఒక సినిమాను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని లేటెస్ట్ న్యూస్. అక్కినేని ఫ్యామిలీ తో మనం సినిమా తర్వాత విక్రమ్ కుమార్ బాగా అటాచ్ మెంట్ ని పెట్టుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా అక్కినేని హీరోలు కూడా విక్రమ్ కుమార్ అంటే ఎంతో నమ్మకం. అందుకే చైతూ తో సినిమా ప్లాన్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం లవ్ స్టోరీ ముగించే పనిలో ఉన్న నాగచైతన్య ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని తాజా సమాచారం.

 

దర్శకుడు విక్రమ్ కుమార్ చెప్పిన స్టోరీ కి ఇంప్రెస్ అయిన నాగచైతన్య లవ్ స్టోరీ విడుదల అయిన వెంటనే చేసేద్దాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికారకంగా ప్రకటన వెలువడనుంది. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా సక్సస్ అవుతుందా అసలే విక్రమ్ కుమార్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడుగా అంటూ అటు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా భావిస్తున్నారట. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: