మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని  స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. రీసెంట్ గా గద్దలకొండ గణేష్ సినిమా లో నెగటివ్ షేడ్ ఉన్నపాత్రలో నటించి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా సక్సస్ తో మరోసారి విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం బాక్సింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ నటిస్తున్నాడు.

 

కిరణ్ కొర్రపాటి అన్న వ్యక్తి మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్- సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. సిద్ధు ముద్ద వరుణ్ తేజ్ స్నేహితుడని... ఆయన పేరుతో ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్వయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.

 

అయితే వరుణ్ వేరే వ్యక్తి ద్వారా సినిమాకి ఇన్వెస్ట్ చేయాలసిన అవసరం రావడానికి ఒక బలమైన కారణమే ఉందట. వరుణ్ తేజ్ ఇదివరకూ చెల్లి నిహారిక నటించిన 'సూర్యకాంతం' సినిమాకి వరుణ్ సమర్పకుడిగా వ్యవహరించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఫ్లాపై వరుణ్ తేజ్ కి షాకిచ్చింది. చెల్లికి మంచి హిట్ ఇవ్వాలనుకున్న వరుణ్ ప్లాన్ బెడిసికొట్టింది. దాంతో వరుణ్ బాగా డిసప్పాయింట్ అయ్యాడు.

 

అంతేకాదు నిర్మాతగా తనకి కలిసి రాదేమో అన్న భావంతో సినిమాకి తన పేరు నిర్మాతగా పడకూడదన్న ఉద్దేశ్యంతోనే వరుణ్ ఆఫ్ స్క్రీన్ ఉంటూ తన స్నేహితుడి పేరు మీద సినిమాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట. ఆరెంజ్ సినిమాతో వరుణ్ నాన్న నాగబాబు కూడా నిర్మాతగా భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో వచ్చిన భారీ నష్టాలతో కొన్నాళ్ళు నాగబాబు బాగా కృంగిపోయిన సంగతి. అందుకే ఇప్పుడు వరుణ్ తేజ్ కి ఆ అనుభవమే ఒక పెద్ద ఉదాహరణ గా ఈసుకొని ఇలా చేస్తున్నాడట. అయితే ఇలా చేయడం కరెక్టేనా అన్న డైలమాలోను ఉన్నాడట మెగా ప్రిన్స్.  

మరింత సమాచారం తెలుసుకోండి: