టాలీవుడ్ హాట్ బ్యూటీ అంటే ప్ర‌స్తుతం ఎవ‌రో కాదు మ‌హేష్‌బాబు హీరోయిన్‌. ఎవ‌రా అనుకుంటున్నారా అదేనండీ కియారా అద్వానీ. ఈ భామ హాట్ ఫొటో షూట్ల‌కి ముందుంట‌ది. ఏ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్ అయినా ముందు ఈమెనే సంప్ర‌దిస్తారు. ఇక హాట్ హాట్ గా తన అందాల‌ని ఆర‌బోయ‌డంలో ఈమెకి కొత్తేమి కాదు. అయితే ఇటీవ‌లే  కాస్మోపాలిటన్ అనే మ్యాగజైన్ కోసం కియారా ఓ ఫోటో షూట్ చేసింది. ఇక లేటేముంది వెంట‌నే సదరు మ్యాగజైన్ కవర్ పేజి పై మెరిసింది. ఎయిర్ ఫోర్స్ పైలట్లు ధరించే సింగిల్ పీస్ ప్యాంట్ షర్టు బ్లూక‌ల‌ర్‌ది వేసి పైన ష‌ర్ట్‌కి బ‌ట‌న్స్ పెట్ట‌కుండా ఫుల్ హాట్ హాట్ ఫోజులిచ్చింది. డెనిమ్ డ్రెస్ కావడంతో మంచి ఫాష్‌లుక్ లో క‌నిపిస్తుంది ఈ భామ‌. పైన బటన్లు పెట్టుకోకుండా ఫక్తు బాలీవుడ్ ఘాటుభామలాగా గ్లామరసం పంచింది. నడుముకు పెట్టుకున్న బెల్ట్ కూడా స్టైల్ గా ఉంది. ఈ ఫోటోలకు కియారా ఇచ్చిన క్యాప్షన్ "నా విశ్వం ఇది..  ఇసోలేషన్ కు ఛీర్స్." 

 

అంటే ఈ భామ అర్ధం ఏమిటంటే కరోనా ఇసోలేషన్ లో కూడా ఇలా ఫ్యాషన్ ను చూపించ వచ్చని.. ఛీర్స్ చెప్పొచ్చని నిరూపించడం అందరికీ సాధ్యమయ్యే పనే కాదు.  ఈ ఫోటోలతో పాటు కియారా మరో వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియో నేపథ్యంలో జేమ్స్ బాండ్ తరహా సంగీతం వస్తూ ఉంటే కియారా అలా ఆ మ్యూజిక్‌కి త‌గ్గ‌ట్టు వ‌య్యారంగా వేసే అడుగులు కుర్ర‌కారుల మ‌తిని పోగొడుతుంది.

 

ఇక కియారా నెక్స్‌ట్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'భూల్ భులయ్యా 2'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది. అన్నీ క్రేజీ  ప్రాజెక్టులు కావడం విశేషం. ప్రస్తుతం కియారా డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉందట. మ‌రి ఈ బాలీవుడ్ భామ‌కి తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా ప‌నికొస్త‌ది మ‌రి ద‌ర్శ‌కులు ఎందుకోగాని ఈ భామ వైపు చూడ‌టం లేదు. సీనియ‌ర్లు చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున‌, బాల‌కృష్ణ వీళ్ళ ప‌క్క‌న ఈ హీరోయిన్ చాలా బావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: